మీకు తెలియకుండానే ఏడుస్తున్నారా.. కారణాలు ఇవే!

  • Published By: veegamteam ,Published On : January 4, 2020 / 06:04 AM IST
మీకు తెలియకుండానే ఏడుస్తున్నారా.. కారణాలు ఇవే!

Updated On : January 4, 2020 / 6:04 AM IST

మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో మనకి తెలియకుండానే ఏడుస్తాం. ఏదో సినిమా చూస్తునో, స్నేహితులతో మాట్లాడుతునో… సడెన్ గా కారణం లేకుండా కనీళ్లు పెట్టుకుంటాం. అయితే సైకాలజిస్టు జరిపిన పరిశోధనలో స్త్రీలు మగవారికన్నా ఎక్కువగా  ఏడుస్తుంటారని తెలిసింది. 

అసలు మనం ఎందుకు ఏడుస్తున్నామో తెలీకుండా ఏడవటం మానసిక ఆరోగ్య సమస్య. అందరి జీవితాలలో ఏడుపు సాధారణమే కానీ, కొన్నిసార్లు కొందరు ఏ కారణం లేకుండా ఏడుస్తుంటారు. కొంతమంది సంతోషంగా ఉన్నప్పుడు లేదా ఆశ్చర్యపోయినప్పుడు ఏడుస్తారు, కొందరు కోపంలో, ఆందోళనలో ఏడుస్తారు. ఇలా జరగటానికి అసలు కారణం అనారోగ్య స్థితి కావచ్చు, అలసట,మానసిక వత్తిడి, ఆందోళన, డిప్రెషన్ కూడా కావచ్చు.

డిప్రెషన్ లో ఉన్నవారు:
ఏడవటానికి సాధారణమైన కారణాలలో ఒకటి డిప్రెషన్.  అంటే ఏదన్నా సంఘటన జరగటం వల్ల మీరు బాధపడుతూ కొన్నిరోజుల పాటు బాధగానే ఉండటం. లేదా ఏదైనా ఆలోచిస్తూ తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లి ఏడుస్తూ ఉంటారు. 

ప్రగ్నేంట్ గా ఉన్నవారు:
ఎటువంటి కారణం లేకుండా మీరు ఏడుపు కలిగించే మరొక విషయం గర్భం. ఎందుకంటే ఆ సమయంలో మీ శరీరంలో జరిగే మార్పుల కారణంగా మీకు తెలియకుండానే మీరు ఏడుస్తారు.

ఇలాంటి సమయంలో డాక్టర్ ని సంప్రదించాలి:
మీకు మీరు డిప్రెషన్ లో ఉంటున్నారని అన్పిస్తే.. వెంటనే డాక్టరు కానీ, సైకాలజిస్టును కానీ సంప్రదించండి. మీరొక్కరే కృంగిపోవడం మంచిది కాదు. మీకు సైకాలజిస్టు ఎవరూ తెలీకపోతే, బెటర్ హెల్ప్ లో ఆన్ లైన్ థెరపిస్టులు ఉంటారు, వారు మీతో ఆన్ లైన్ ఛాట్ లేదా ఫోన్ ద్వారా మీ సమస్య గురించి మాట్లాడతారు. లేదా మీకు దగ్గరలో ఉన్న థెరపిస్టు దగ్గరకి వెళ్ళి మీ సమస్య గురించి చెప్పండి.