Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్ళంతా ఒకచోట కలిస్తే.. మేకింగ్ వీడియో!
శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకొని..

Aadavallu Meeku Johaarlu
Aadavallu Meeku Johaarlu: శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ప్రస్తుతం అన్ని పనులు పూర్తి చేసి మార్చి 4న ఈ శుక్రవారం సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రిలీజ్ టైం దగ్గర పడేకొద్దీ వరసగా సాంగ్స్, టీజర్లు విడుదల చేసి ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన యూనిట్ ఈ మధ్యనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించి మరింత అటెన్షన్ క్రియేట్ చేసింది.
Aadavallu Meeku Johaarlu: కలిసొచ్చిన కామెడీనే నమ్ముకున్న శర్వా.. హిట్ కొట్టేనా?
దర్శకుడు సుకుమార్ ప్రీరిలీజ్ వేడుకకు హాజరై ఆడవాళ్ళకి ఆశీస్సులు అందించగా.. హీరో రవితేజ లాంటి వాళ్ళు సినిమాకు బెస్ట్ విషెష్ చెప్పడంతో ఈ సినిమాకి ఇండస్ట్రీ నుండి గట్టి సపోర్ట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎటు చూసినా అన్నీ కలిసొచ్చే అంశాలతో పాటు శర్వానంద్ కి అచ్చొచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో.. ఒకవిధంగా ఈ సినిమా గ్యారంటీ హిట్ అంటే టాక్ కూడా సొంతం చేసుకుంది. మరో రెండు రోజులే సినిమా విడుదలకు సమయం ఉండడంతో యూనిట్ టైటిల్ సాంగ్ వీడియోతో పాటు ఒక మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.
Aadavallu Meeku Johaarlu: తానో లేడీ పవన్ కళ్యాణ్.. సాయిపల్లవిపై సుకుమార్ కామెంట్స్!
మేకింగ్ వీడియోలో హీరోయిన్ రష్మిక ఫస్ట్ క్లాప్ కొట్టినట్లు చూపించగా.. ఆ తర్వాత సెట్స్‌లో ఉన్నవాళ్లను ఆటాడిస్తూ తెగ అల్లరి చేసిందీ హీరోయిన్. సీనియర్ నటీమణులు ఖష్బూ, రాధిక, ఊర్వశిలు కూడా కెమెరా ఆఫ్‌లో ఉన్నప్పుడు సరదాగా నవ్వుతూ షూటింగ్‌ను తెగ ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోండగా.. షూటింగ్ యూనిట్, కొరియోగ్రాఫర్లు, యాక్షన్ కొరియోగ్రాఫర్లు ఇలా అంతా ఆడవాళ్ళ అల్లరికి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆడవాళ్ళని కూర్చోబెట్టి శర్వానంద్ అందరికీ వడ్డించడం కూడా చూపించారు.