యువనటుడు మృతి.. విచారం వ్యక్తం చేసిన చిత్ర పరిశ్రమ..

తమిళ యువ నటుడు, వైద్యుడు సేతురామన్ గుండెపోటుతో కన్నుమూశారు..

  • Published By: sekhar ,Published On : March 27, 2020 / 09:43 AM IST
యువనటుడు మృతి.. విచారం వ్యక్తం చేసిన చిత్ర పరిశ్రమ..

Updated On : March 27, 2020 / 9:43 AM IST

తమిళ యువ నటుడు, వైద్యుడు సేతురామన్ గుండెపోటుతో కన్నుమూశారు..

త‌మిళ యువ న‌టుడు సేతురామ‌న్ (36) క‌న్నుమూశారు. గురువారం గుండెపోటు రావ‌డంతో రాత్రి 8 గంట‌ల 45 నిమిషాల‌కు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. సేతురామ‌న్‌ ఆక‌స్మిక మ‌ర‌ణం త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను దిగ్భ్రాంతికి గురైంది. సేతురామ‌న్ న‌టుడే కాక వృత్తిరిత్యా స్కిన్ డాక్టర్ కూడా. చెన్నైలో స్వ‌త‌హాగా జీ క్లినిక్‌ను (స్కిన్ కేర్‌) ఏర్పాటు చేసుకుని వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. సేతురామ‌న్‌కు భార్య ఉమ‌యాల్, ఏడాది వ‌య‌స్సున్న కూతురు ఉన్నారు. సేతురామ‌న్ త‌మిళ హాస్య‌ న‌టుడు సంతానానికి అత్యంత స‌న్నిహితుడు.

Actor and Doctor Sethuraman passed away

2013లో విడుదలైన ‘కన్నా లడ్డూ తిన్నా ఆసయ్య’ చిత్రం ద్వారా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడు. డైరెక్ట‌ర్‌ మణికందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతానం, సేతు, పవర్‌స్టార్ శ్రీనివాసన్, విశాఖా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనంత‌రం ‘వాలిబా రాజా’, ‘సక్కా పోడు పోడు రాజా అండ్‌ 50/50’.. వంటి చిత్రాల్లో నటించి మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

కాగా చిన్న వయసులోనే సేతురామ‌న్‌ దూరమవడం నమ్మకలేక పోతున్నామంటూ అతని మరణం పట్ల అనేక మంది నటులు, దర్శకులు తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తున్నారు. ఖుష్బు, దర్శక నిర్మాత వెంకట్ ప్రభు, ధనంజయన్ తదితరులు సేతురామ‌న్ ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ట్విట‌్టర్ ద్వారా సంతాపం తెలిపారు. ఇక సేతురామ‌న్ అంత్య‌క్రియ‌లు ఈ రోజు(శుక్ర‌వారం) జ‌ర‌గ‌నున్నాయి.