నోరా తాటి మట్టా : అత్యాచారాలకు కారణం ఆడవాళ్లే.. నటుడు భాగ్యరాజా వివాదాస్పద వ్యాఖ్యలు 

  • Published By: veegamteam ,Published On : November 27, 2019 / 05:56 AM IST
నోరా తాటి మట్టా : అత్యాచారాలకు కారణం ఆడవాళ్లే.. నటుడు భాగ్యరాజా వివాదాస్పద వ్యాఖ్యలు 

Updated On : November 27, 2019 / 5:56 AM IST

అత్యాచారాలు జరగటానికి కారణం ఆడవారే నంటు నోటికొచ్చినట్లల్లా వాగాడు ప్రముఖ నటుడు..దర్శకుడు భాగ్యరాజా. సినిమాకు సంబంధించిన ఓ కార్యక్రమంలో భాగ్యరాజా మాట్లాడుతూ..మహిళలపై తనకున్న అభిప్రాయాన్ని తన దారుణ వ్యాఖ్యల ద్వారా బైటపెట్టాడు. మహిళలు పద్దతీ పాడు లేకుండా ఉంటున్నారనీ..కట్టుబాట్లను గాలికి వదిలేస్తున్నారంటూ వ్యాఖ్యానించాడు. ఆడవాళ్లపై వేధింపులు జరిగినా..అత్యాచారాలు జరిగినా దానికి వారేననీ..వారి అజాగ్రత్త వల్లనన్నాడు.

మహిళలు సెల్‌ఫోన్‌లు బాగా వాడుతున్నారనీ..దాంతోనే లోకం అన్నట్లుగా ఉండటం కూడా వారిపై అఘాయిత్యాలు జరగటానికి కారణమన్నాడు. ఆడవాళ్లు ఒక్కొక్కరు రెండు ఫోన్లు వాడుతో రెండింటిలోను నాలుగు సిమ్ లు వాడుతున్నారు..చాటింగ్ లు చేస్తూ..సంప్రదాయాల్ని..కట్టుబాట్లలో వదిలేయటం..ఫోన్లతోనే కాలక్షేపం చేయటం వల్లనే ఇటువంటి దారుణాలు జరుగతున్నాయన్నాడు. గతంలో ఇటువంటిటి దారుణాలు జరగలేదని మహిళలు సెల్ ఫోన్లు వాడకం పెరిగిన తరువాతే అత్యాచారాలు పెరిగాయన్నాయడు.

సంచలనం సృష్టించిన సంఘటనలపై మాట్లాడిన సదరు పెద్ద మనిషి భాగ్యరాజ..అమ్మాయిలపై అబ్బాయిలు దారుణాలకు పాల్పడే విషయంలో కేవలం అబ్బాయిలను మాత్రమే తప్పు పట్టడం కరెక్ట్ కాదన్నాడు. అమ్మాయి జాగ్రత్తగా ఉంటే ఇటువంటిటి ఘటనలు జరగవని పెద్ద సలహాలు ఇచ్చేశారు దర్శకుడు భాగ్యరాజా.  
అంతటితో ఈ సీనియర్ నటుడు..దర్శకుడి మాటలు ఆగిపోలేదు..మగవాడు తప్పు చేసినా సరిదిద్దుకోవచ్చు..కానీ ఆడవాళ్లు తప్పు చేస్తే కరెక్ట్ చేయలేమనీ..ఒక మహిళ  ఒక పురుషుడికి రెండో భార్య ఉంటే మొదటి భార్యకు ఎటువంటిసమస్యా ఉండదు..కానీ అదే ఒక మహిళకు వివాహేతర సంబంధం కలిగి ఉంటే ఆమె తన మొదటి భర్తను చంపేస్తున్న దారుణాలు జరుగుతున్నాయని అన్నాడు. అంతేకాదు మహిళలు తమ పరిధులు దాటకుండా ఉంటే వారికి ఎటువంటి ప్రమాదాలు జరగవనీ..అందుకే మహిళలు పరిమితుల్లో ఉంటేనే మంచిది అంటూ తెగ సలహాలు ఇచ్చేశాడు ఈ ప్రబుద్ధుడు. 

ఈ క్రమంలో భాగ్యరాజా చేసిన ఈ దారుణ వ్యాఖ్యలపై మహిళ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఆడవారిపై ఇలా నోరు పారేసుకున్న పెద్ద మనిషీ..వెంటనే మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్‌ చేస్తున్నాయి. భాగ్యరాజపై కేసులు కూడా నమోదవుతున్నాయి. మీటూ ఆరోపణలతో తమిళ ఇండస్ట్రీ పరువు బజార్న పడిన క్రమంలో తాజాగా భాగ్యరాజ చేసి ఈ వ్యాఖ్యలు కాకపుట్టిస్తున్నాయి.