పేరుతో పాటు ఫేస్ కూడా వాడేశారు.. 70 కోట్లు కట్టండి మరి..

  • Published By: Mahesh ,Published On : April 27, 2020 / 12:12 PM IST
పేరుతో పాటు ఫేస్ కూడా వాడేశారు.. 70 కోట్లు కట్టండి మరి..

Updated On : April 27, 2020 / 12:12 PM IST

Los Angeles: పాపులర్ సింగర్ కమ్ యాక్ట్రెస్ Selena Gomez అనుమతి లేకుండా తన పేరుతో పాటు, మొహాన్ని కూడా వాడుకున్నారంటూ ఓ మొబైల్ ఫ్యాషన్ గేమ్ సంస్థపై భారీ మొత్తంలో దావా వేసింది. నష్టపరిహారంగా 10మిలియన్ డాలర్లు(రూ.70కోట్లపైగా) చెల్లించాలని డిమాండ్ చేసింది.

తన ప్రెస్టీజ్ తగ్గించే విధంగా సదరు గేమ్ కంపెనీ ప్రవర్తించిందని.. పలు పాపులర్ బ్రాండ్స్ వారు తమ ప్రచారం కోసం సెలెనాకు కోట్లాది రూపాయలు చెల్లిస్తాయని, అలాంటిది కనీసం అనుమతి కూడా లేకుండా ఆమె రూపాన్ని, పేరును వాడుకోవడం నేరమని సెలెనా గోమెజ్ పిటిషన్లో పేర్కొంది.

సెలబ్రిటీల పిక్స్ వాడే ముందు వారి పర్మిషన్ తప్పనిసరి అని.. లేని పక్షంలో వారు దావా వేసినంతా కట్టకతప్పదని పలువురు హాలీవుడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా సెలెనా పలు సూపర్ హిట్ ఆల్బమ్స్ ద్వారా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.