Actress Hema : నేను దర్శనానికి వచ్చాను.. కాంట్రవర్సీకి కాదు.. దుర్గమ్మ గుడిలో విలేఖరిపై ఫైర్ అయిన హేమ..
హేమ మాట్లాడి వెళ్లిపోతుంటే ఓ విలేఖరి ‘‘మేడమ్ మీరు ఎంతమంది వచ్చారు, దర్శనానికి ఏ టిక్కెట్ కొన్నారు? అని ప్రశ్నించాడు.'' దీంతో హేమ ఆ విలేకరిపై సీరియస్ అయి............

Actress Hema fires on reporter at Vijayawada Durga Temple
Actress Hema : విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని చూడటానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆలయానికి విచ్చేస్తున్నారు. సోమవారం నాడు దుర్గమ్మని దర్శించుకోవడానికి సినీ నటి హేమ ఆలయానికి వచ్చింది. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడింది హేమ.
హేమ మీడియాతో మాట్లాడుతూ.. ”దుర్గమ్మ అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని వార్తల్లో చూసి ఈ సంవత్సరం అమ్మవారిని దర్శనం చేసుకోలేనేమోనని కంగారుపడ్డాను. కానీ ఆ దేవి దయ వల్ల దర్శనం అయింది” అని తెలిపింది. అయితే హేమ మాట్లాడి వెళ్లిపోతుంటే ఓ విలేఖరి ‘‘మేడమ్ మీరు ఎంతమంది వచ్చారు, దర్శనానికి ఏ టిక్కెట్ కొన్నారు? అని ప్రశ్నించాడు.”
దీంతో హేమ ఆ విలేకరిపై సీరియస్ అయి.. ”మేము ఇద్దరం వచ్చాం. ప్రొటోకాల్ ప్రకారమే టిక్కెట్ కొనుక్కొని అమ్మవారి దర్శనం చేసుకున్నాం. హుండీలో రూ.10 వేలు వేశాను, అమ్మవారికి రూ.20 వేల చీర ఇచ్చాను. ఇంకా ఏమన్నా చెప్పాలా? నేను దర్శనానికి వచ్చాను, కాంట్రవర్సీ చేయడానికి కాదు” అని కోపంగా వెళ్ళిపోయింది.