Pooja Hegde : పూజా హెగ్డే కాలికి గాయం..! ఆస్పత్రికి వెళ్లకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్..!
పూజా హెగ్డే.. పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొంతకాలం పాటు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. అయితే.. ఏమైందో తెలీదు ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో అమ్మడు కనిపించడం లేదు.

Pooja Hegde instagram post viral
Pooja Hegde instagram post viral : పూజా హెగ్డే.. పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొంతకాలం పాటు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. అయితే.. ఏమైందో తెలీదు ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో అమ్మడు కనిపించడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. అయితే..తాజాగా పూజా కాలికి గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా బుట్ట బొమ్మే తెలియజేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పూజా హెగ్డే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. కాగా.. బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఆమె రెండు మోకాళ్లకు దెబ్బలు తగిలాయి. మోకాళ్లకు తగిలిన గాయాలకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. బాక్సింగ్ ప్రాక్టీస్‌లో తగిలినట్లు చెప్పింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారగా నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. కాగా.. పూజా బాక్సింగ్ నేర్చుకోవడానికి కారణం ఏంటి..? నార్మల్‌గానే నేర్చుకుంటుందా..? లేదా ఏదైన సినిమా కోసం నేర్చుకుంటుందా..? అన్నది తెలియాల్సి ఉంది.
Tollywood : తెలుగులో రాబోతున్న సీక్వెల్స్, పార్ట్ 2 చిత్రాలు ఇవే..

Pooja Hegde instagram post
ఇటీవల పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్ (హిందీ) ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. మహేశ్ సరసన గుంటూరు కారం చేస్తుంది అనుకుంటే ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుందని నిర్మాత నాగవంశీ చెప్పాడు. బాలీవుడ్ సినిమా డేట్స్ క్లాష్ రావడంతో పూజా తప్పుకున్నట్లు ఇటీవల ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే.