Pawan kalyan – Ram Charan : బాబాయ్ కాళ్లకు నమస్కరించిన చరణ్..
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పవన్ వచ్చారు.

Pawan kalyan - Ram Charan
Pawan kalyan – Ram Charan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయాన్ని సాధించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ ఆధిక్యంతో గెలిచారు. అంతేకాకుండా జనసేన తరుపున నిల్చున్న 21 మందిని ఎమ్మెల్యేలుగా, ఇద్దరిని ఎంపీలుగా గెలిపించుకున్నారు. కూటమిగా జట్టు కట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దీంతో పవన్‌కు అన్ని వైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీని పవన్ కలిశారు. తాజాగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పవన్ వచ్చారు. భార్య అన్నా లెజనోవా, తనయుడు అకిరా నందన్ తో కలిసి మెగాస్టార్ ఇంటికి వెళ్లిన పవన్‌కు ఘన స్వాగతం లభించింది. అన్నయ్యను చూసిన వెంటనే పవన్ ఆయన కాళ్లకు నమస్కరించారు. ఇక మెగాస్టార్ సైతం ఆనందభాష్పాలతో పవన్‌ను కౌగిలించుకున్నారు.
Kanchana 4 : రాఘవ లారెన్స్ ‘కాంచన 4’ వచ్చేస్తోంది..
పవన్ తన తల్లి అంజనమ్మ, వదిన సురేఖలకు కూడా పాదభివందనం చేశారు. పవన్ విజయంతో తల్లి అంజనా దేవి కన్నీళ్లు పెట్టడంతో పవన్ ప్రేమగా హత్తుకున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ బాబాయ్ పవన్‌కు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశాడు. వెంటనే పవన్ కాళ్లకు నమస్కరించారు. మెగా కుటుంబం అంతా సంతోషంగా కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.