Aishwarya Prabhu : స్టార్ డైరెక్టర్‌ను రెండో పెళ్లి చేసుకున్న నటుడు ప్రభు కూతురు

సీనియర్ నటుడు ప్రభు కూతురు ఐశ్వర్య యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌ను పెళ్లి చేసుకున్నారు. తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వీరి వివాహానికి హాజరై ఆశీర్వదించారు.

Aishwarya Prabhu :  స్టార్ డైరెక్టర్‌ను రెండో పెళ్లి చేసుకున్న నటుడు ప్రభు కూతురు

Aishwarya Prabhu

Updated On : December 15, 2023 / 3:14 PM IST

Aishwarya Prabhu : ప్రముఖ నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్య ప్రభు డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌ను పెళ్లాడారు. కొద్దిరోజులుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఓ ఇంటి వారయ్యారు. వీరి పెళ్లికి హీరో విశాలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Joruga Husharuga : జోరుగా హుషారుగా మూవీ రివ్యూ.. ‘బేబీ’ సినిమా విరాజ్ అశ్విన్ హీరోగా మెప్పించాడా?

సీనియర్ నటుడు ప్రభు అందరికీ సుపరిచితమే.  ప్రభు కూతురు ఐశ్వర్య యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఐశ్వర్యకు ఇది రెండవ వివాహం. 2008 లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ను పెళ్లాడిన ఐశ్వర్య మనస్పర్థలతో భర్త నుండి విడిపోయారు. కొంతకాలంపాటు యూఎస్‌లో ఉన్న ఐశ్వర్య ఇటీవలే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చారు. ఐశ్వర్య సోదరుడు విక్రమ్ ప్రభు కూడా కోలీవుడ్ నటుడే.

Varuj Tej : ‘హ్యాపీ బర్త్ డే బేబీ’ అంటూ లావణ్యకు వరుణ్ బర్త్ డే విషెస్

అధిక్ రవిచంద్రన్ 2015 లో ‘త్రిష ఇలియానా నయనతార’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి వచ్చారు. ప్రభుదేవా సినిమా ‘బగీరా’ కూడా రవిచంద్రన్ డైరెక్ట్ చేశారు. తాజాగా ఆయన డైరెక్ట్ చేసిన ‘మార్క్ ఆంటోనీ’ ఈ ఏడాది విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో విశాల్, సూర్య నటించారు. 2024 లో అజిత్ కుమార్‌తో రవిచంద్రన్ ప్రాజెక్టు ఉంది. కాగా నటుడిగా కూడా అధిక్ రవిచంద్రన్‌కు అనుభవం ఉంది.