స్టైలిష్ డైరెక్టర్‌తో అఖిల్ 5 ఫిక్స్..

  • Published By: sekhar ,Published On : August 10, 2020 / 05:56 PM IST
స్టైలిష్ డైరెక్టర్‌తో అఖిల్ 5 ఫిక్స్..

Updated On : August 11, 2020 / 6:50 AM IST

అక్కినేని నాగార్జున చిన్నకొడుకు అఖిల్ ఫస్ట్ సినిమాకి వచ్చిన హైప్ చూస్తే తప్పకుండా యూత్ స్టార్ అవుతాడనుకున్నారంతా.. అంచనాలను అందుకోలేకపోయినా ఓ రకంగా అతనికి మంచిదే అయింది. సినిమా సినిమాకు తనను తాను మౌల్డ్ చేసుకుంటూ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరయ్యే కథలను సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.



Akhil ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా చేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కథలు వింటున్న అఖిల్ తన తర్వాతి సినిమాను కన్ఫమ్ చేసేశాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.



స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ తన 5వ సినిమా చేయనున్నాడట. అఖిల్ నుంచి అక్కినేని ఫ్యాన్స్, ఆడియెన్స్ కోరుకునే అంశాలతోపాటు తన మార్క్ మాస్ అండ్ స్టైలిష్ మేకింగ్‌కి తగ్గట్టు సురేందర్ రెడ్డి సాలిడ్ స్టోరి రెడీ చేశాడట. అఖిల్, సూరి లాంటి డైరెక్టర్ చేతిలో పడితే హిట్ పక్కా అని ధీమాగా చెబుతున్నారు అక్కినేని అభిమానులు. త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. Akhil's next with Surender Reddy