మామూలోడివి కాదు స్వామీ.. మున్సిపల్‌ కార్మికులకు అక్షయ్ భారీ విరాళం..

కరోనా క్రైసిస్ : మరోసారి భారీ విరాళం ప్రకటించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్..

  • Published By: sekhar ,Published On : April 10, 2020 / 09:21 AM IST
మామూలోడివి కాదు స్వామీ.. మున్సిపల్‌ కార్మికులకు అక్షయ్ భారీ విరాళం..

Updated On : April 10, 2020 / 9:21 AM IST

కరోనా క్రైసిస్ : మరోసారి భారీ విరాళం ప్రకటించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్..

కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోమారు భారీ విరాళం ప్రకటించి మంచి మనసు చాటుకున్నారు. ఆయన ఇటీవల ఏకంగా రూ.25 కోట్ల ఆర్థిక సహాయం చేసి తన భార్యను సైతం ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.

తాజాగా అక్షయ్ మరోసారి భారీ విరాళం ప్రకటించారు. ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. మున్సిపల్‌ కార్మికులకు అవసరమైన పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) మరియు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ కోసం అక్షయ్ ఈ విరాళం అందించారు.

Read Also : పదహారేళ్లకే పవర్ చూపిస్తున్నావ్.. పాతికేళ్లొస్తే ఎట్టాగబ్బా కొణిదెల అకీరా..

సినీ ప్రముఖులు, సామాన్య ప్రేక్షకులు సైతం అక్షయ్ మంచి మనసుకి అభినందనలు తెలియచేస్తున్నారు. తన వద్ద ఒకప్పుడు 200 వందల రూపాయలు కూడా లేవని.. కానీ ఇప్పుడు తనకు ఎలాంటి ఇబ్బందులు లేనందున ఆపదలో ఉన్నవారికి సాయం చేయడానికి వెనకడుగు వేయనని అక్షయ్ తెలిపారు.