Alia Bhatt : అలియా భట్ ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన అలియా..
అలియా భట్ తాత, నటి సోనీ రాజ్దాన్(Sony Razdan) తండ్రి నరేంద్రనాద్ రాజ్దాన్ ఇటీవల మరణించారు. ఆయన మరణంతో అలియా ఇంట విషాదం నెలకొంది. తాజాగా అలియా తన తాతను గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన తాత పుట్టిన రోజు చేసుకున్నప్పటి వీడియోని షేర్ చేసింది అలియా.

Alia Bhatt Grandpa Narendranath Razdan passes away at the age of 93
Narendranath Razdan : బాలీవుడ్(Bollywood) భామ అలియా భట్(Alia Bhatt) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అలియా భట్ తాత, నటి సోనీ రాజ్దాన్(Sony Razdan) తండ్రి నరేంద్రనాద్ రాజ్దాన్ ఇటీవల మరణించారు. ఆయన మరణంతో అలియా ఇంట విషాదం నెలకొంది. తాజాగా అలియా తన తాతను గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన తాత పుట్టిన రోజు చేసుకున్నప్పటి వీడియోని షేర్ చేసింది అలియా.
ఆ వీడియో షేర్ చేస్తూ.. నా హీరో, మా తాతయ్య. 93 ఏళ్ళ వరకు కూడా పనిచేశారు, ఆడుకున్నారు. నాకెన్నో కథలు చెప్పారు. బెస్ట్ ఆమ్లెట్ చేసిచ్చేవాళ్ళు. తన ముని మనవరాలుతో కూడా ఆడుకునేవారు. చివరివరకు కూడా ఆయన జీవితాన్ని ప్రేమించారు. నా మనసంతా బాధతో నిండిపోయింది. కానీ ఆయన మాకు చాలా సంతోషాన్ని ఇచ్చారు. అదే సంతోషాన్ని కొనసాగిస్తాం. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అనుకుంటున్నాను అని ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తూ అలియాకు ధైర్యం చెప్తున్నారు.
అలియా భట్ సోదరి షాహీన్ భట్ కూడా తన తాత మరణంపై ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. తన తాతతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. నరేంద్రనాద్ రాజ్దాన్ ప్రముఖ ఆర్కిటెక్ట్ గా వర్క్ చేశారు. 90 ఏళ్ళ వయసులోనూ ఆయన వర్క్ చేశారు. ఓ బ్రిటిష్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. నరేంద్రనాద్ రాజ్దాన్ కూతురు సోనీ రాజ్దాన్ బాలీవుడ్ లో నటిగా ఉంది. సోనీ రాజ్దాన్ కూతురే అలియా భట్.