DSP : ఐటెం సాంగ్స్ అన్ని డివోషనల్ సాంగ్సే : దేవిశ్రీ ప్రసాద్
ఇటీవల జరిగిన 'పుష్ప' ప్రమోషన్స్ లో ఐటెం సాంగ్స్ పై దేవిశ్రీ మాట్లాడుతూ ఐటెం సాంగ్స్ అన్ని నాకు డివోషనల్ సాంగ్సే అన్నారు. నాకు అన్నీ ఒకటే. నేను కేవలం మ్యూజిక్ గురించి మాత్రమే.......

Dsp
DSP : ‘పుష్ప’ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన సమంత ఐటెం సాంగ్ ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ పాట బాగా వైరల్ అయింది. అంతే కాక ఈ పాట చుట్టూ వివాదాలు కూడా అల్లుకుంటున్నాయి. గతంలో కూడా సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో చాలా ఐటెం సాంగ్స్ వచ్చాయి. సుకుమార్ సినిమా అంటే కచ్చితంగా ఐటెం సాంగ్ ఉండాల్సిందే. దానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కొట్టాల్సిందే. అయితే ‘పుష్ప’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దేవి శ్రీ ప్రసాద్ ఈ ఐటెం సాంగ్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల జరిగిన ‘పుష్ప’ ప్రమోషన్స్ లో ఐటెం సాంగ్స్ పై దేవిశ్రీ మాట్లాడుతూ ఐటెం సాంగ్స్ అన్ని నాకు డివోషనల్ సాంగ్సే అన్నారు. నాకు అన్నీ ఒకటే. నేను కేవలం మ్యూజిక్ గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఐటెం సాంగ్ మీకు మాత్రమే నాకు కాదు. నాకు అన్ని ఐటెం సాంగ్స్ డివోషనల్ సాంగ్సే అని అన్నారు. ఉదాహరణకు పాడి చూపిస్తాను అని తాను కంపోజ్ చేసిన రెండు ఐటెం సాంగ్స్ కి డివోషనల్ లిరిక్స్ తో పాడి వినిపించారు దేవిశ్రీ.
ఆర్య 2 సినిమాలోని ‘రింగ రింగ..’ సాంగ్ కి ‘నాకు ఉన్న కోరికలన్నీ.. నువ్వే తీర్చాలి స్వామి.. స్వామీ.. స్వామీ..’ అంటూ అదే ట్యూన్ తో పాడారు. ఇక ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా..’ సాంగ్ కి కూడా ‘స్వామీ.. నేను కొండ ఎక్కాను, పూలు పళ్ళు అర్పించాను.. ప్రసాదం తినేసి.. నా కష్టాలు తీర్చు స్వామి.. ఊ అంటావా స్వామి.. ఊ ఊ అంటావా స్వామి..’ అని పాడి వినిపించారు. ఈ పాట బాగా వైరల్ అయ్యాక ప్రముఖ డివోషనల్ సింగర్ శోభారాజ్ గారు ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ సాంగ్ ని డివోషనల్ కి మార్చి పడుకున్నారని తెలిపారు. ‘ఊ అంటావా మాధవ.. ఊ ఊ అంటావా మాధవ..’ అని కృష్ణుడి కోసం పాడారు అని తెలిపారు. పాటని మనం ఎలా తీసుకుంటే అలాగే ఉంటుందని అన్నారు.
Balakrishna : బాలయ్య నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలు పెట్టేస్తున్నారుగా..
అంతే కాక మేమంతా ఐటెం బాయ్స్. ఏ సాంగ్ చేస్తే ఆ సాంగ్ ని ఫీల్ అవుతాము. రొమాంటిక్ సాంగ్ చేస్తే రొమాంటిక్ పర్సన్స్ అవుతాము. డివోషనల్ సాంగ్ చేస్తే భక్తులు అవుతాము అని అన్నారు. అయినా ఒక పాట ఎప్పటికి గుర్తుండి పోయే పాట అయితే అది ఏ సాంగ్ అయినా గ్రేట్ సాంగ్ అని అన్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.