Theaters Issue : థియేటర్స్ ని ఆ నలుగురే రూల్ చేస్తున్నారు.. అవును అంటూ క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్, సురేష్ బాబు

తెలుగు సినీ పరిశ్రమని ఆ నలుగురు నిర్మాతలే రూల్ చేస్తున్నారని, థియేటర్స్ వాళ్ళ దగ్గరే ఉంచుకుంటున్నారని చాలా మంది అంటారు. కొంతమంది ఈ విషయంలో వాళ్ళని తిడుతూ ఉంటారు కూడా. అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణ దీని గురించి అడగడంతో అల్లు అరవింద్, సురేష్ బాబు స్పందించారు...................

Theaters Issue : థియేటర్స్ ని ఆ నలుగురే రూల్ చేస్తున్నారు.. అవును అంటూ క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్, సురేష్ బాబు

Allu aravind and suresh babu reacts on Theaters Issue

Theaters Issue :  ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు పూర్తి కాగా తాజాగా ఐదో ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఐదో ఎపిసోడ్ కి అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వచ్చారు. ఇటీవలే ఈ ప్రోమో రిలీజ్ చేయగా వైరల్ అవ్వడంతో ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ముఖ్యంగా ముందు జనరేషన్ వాళ్ళు ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూశారు. శుక్రవారం రాత్రి నుంచి ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

తెలుగు సినీ పరిశ్రమని ఆ నలుగురు నిర్మాతలే రూల్ చేస్తున్నారని, థియేటర్స్ వాళ్ళ దగ్గరే ఉంచుకుంటున్నారని చాలా మంది అంటారు. కొంతమంది ఈ విషయంలో వాళ్ళని తిడుతూ ఉంటారు కూడా. అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణ దీని గురించి అడగడంతో అల్లు అరవింద్, సురేష్ బాబు స్పందించారు.

బాలకృష్ణ అందరూ అనుకునే ఆ నలుగురిలో ఇద్దరు మీరే కదా, థియేటర్స్ ని మీ దగ్గరే ఉంచుకుంటున్నారు కదా అని అడగడంతో అల్లు అరవింద్, సురేష్ బాబు దీనికి సమాధానమిస్తూ.. ”ఆ నలుగురు అంటే అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, ఆసియన్ సునీల్ అందరూ అనుకుంటారు. అది నిజమే కావచ్చు. ఒకప్పుడు ఊర్లల్లో థియేటర్స్ నడిపేవాళ్లు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వద్ద సినిమాలు కొని వాళ్ళకి షేర్ ఇవ్వలేక నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది థియేటర్ ఓనర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులు ఇచ్చుకోలేక మా దాకా వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పారు. మేము ఈ పర్సంటేజ్, నష్టాలని భరించలేము మా థియేటర్స్ మీరే తీసుకొని, నడుపుకొని మాకు సంవత్సరానికి ఇంత అని ఇవ్వండి అని అడిగారు.”

”అప్పుడు మేము కొన్ని కోట్లు ఖర్చుపెట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్స్ ని తీసుకొని వాటిని బాగు చేసి, మంచి థియేటర్స్ గా మార్చి, అన్ని సౌకర్యాలు కల్పించి నడిపిస్తున్నాము. అంతకుముందు జనాలు అన్ని థియేటర్స్ కి వచ్చేవాళ్ళు కాదు. మేము థియేటర్స్ తీసుకొని బాగు చేశాక జనాలు గతంలో కంటే థియేటర్స్ కి రావడం పెరిగారు. దీని వల్ల కొంతమందికి థియేటర్స్ దొరక్క పోవచ్చు. అందుకే మమ్మల్ని తిడుతున్నారు. ఆ తిట్లు మేము కూడా చూశాము. స్టేజి మీదే తిట్టారు.”

Also Read…………. Chiru-Balayya Combo : చిరు-బాలయ్య కాంబినేషన్.. డైరెక్టర్ ఈయనే.. కథ కూడా చెప్పేసిన బాలయ్య బాబు..

”ఒకప్పుడు మేము కూడా చిన్న సినిమాలు తీసినప్పుడు మాకు కూడా థియేటర్స్ దొరకలేదు. అప్పుడు థియేటర్స్ ఎలా దొరకపట్టుకోవాలో ఆలోచించాము. ఆ రకంగా కూడా ఆలోచించి మేము థియేటర్స్ తీసుకున్నాము. ఈ నలుగురితో పాటు ఇంకో 14 మంది జిల్లాల్లో ఉన్నారు. మేమంతా కలిసి థియటర్స్ ని తీసుకొని, బాగు చేసి రన్ చేయడం వల్లే జనాలు థియేటర్స్ కి వస్తున్నారు. తెలుగు సినిమా బతికింది” అని తెలిపారు.