Game changer : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్?
తెలుగు సినిమాలు బాలీవుడ్ బార్డర్ క్రాస్ చేసి దూసుకెళ్తున్నాయి.

Allu Arjun To Attend Game changer Pre Release Event
Gossip Garage : తెలుగు సినిమాలు బాలీవుడ్ బార్డర్ క్రాస్ చేసి దూసుకెళ్తున్నాయి. విదేశాల్లో ప్రమోషన్లు, ప్రీరిఈజ్ ఈవెంట్లతో రచ్చ లేపుతున్నాయి. మొన్న పుష్ప 2 విదేశాల్లో జాతర చేస్తే.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ టీమ్ కూడా అమెరికాలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఇటు పుష్ప -2 టీమ్ కూడా అమెరికాలోనే సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి బరిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. జనవరి 10న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకోని..శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూనే మరో వైపు ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టింది మూవీ టీమ్.
Allu Arjun : తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్..
పుష్ప-2 కలెక్షన్స్ ఎక్కడ ఆగుతాయో ఇప్పుడే చెప్పటం కష్టం.. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లోకి చేరింది. పుష్పకు అంత బజ్ రావడానికి కారణం ప్రమోషన్స్ దేశ వ్యాప్తంగా చెయ్యటమే..అయితే ఇప్పుడు. మరో బిగ్ ఈవెంట్ పుష్ప2 టీమ్ ప్లాన్ చేసిందని సమాచారం. సక్సెస్ సెలబ్రేషన్స్‌కి గ్రాండ్‌గా ప్లాన్ చేసింది పుష్ప బృందం. అదికూడా అమెరికాలో సెలబ్రేట్ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్, మైత్రి ప్రొడ్యసర్స్ అమెరికా వెళ్లి సక్సెస్ మీట్ పెట్టబోతున్నారు.
ఇటు డిసెంబర్ 21న గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ అమెరికాలో చెయ్యబోతున్నారు. యుఎస్ లో మొదటిసారి ఇలాంటి వేడుక జరుగుతుండటంతో దీని కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా అంచనాల విషయంలో కొంచెం అటుఇటు ఊగుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి బజ్ పెంచే భారం దీని మీదే ఉంది. ఇందులో భాగంగానే నాలుగో లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తారని తెలిసింది.
Pushpa 2 Collections : ‘పుష్ప 2’ కలెక్షన్ల జాతర.. రూ.1000 కోట్ల క్లబ్‌లో.. ఇప్పట్లో ఆగేదే లే..
ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్టుగా పుష్ప సృష్టికర్త సుకుమార్ వెళ్ళబోతున్నారని సమాచారం. రంగస్థలంతో ఈ కాంబో సృష్టించిన రికార్డులు అందరికీ గుర్తే. వింటేజ్ విలేజ్ జానర్ నే ఒక్క కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది ఈ బ్లాక్ బస్టరే. సుకుమార్ వెళ్లేందుకు కారణం లేకపోలేదు. రామ్ చరణ్ 17వ సినిమా సుకుమార్ డైరెక్షన్‌లోనే రానుంది. వచ్చే ఏడాది వేసవిలో సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. కేవలం అనౌన్స్ మెంట్ నుంచే అంచనాలు పెరిగాయి.
మరోవైపు.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ వస్తారనే టాక్ నడుస్తోంది.
https://youtu.be/rVz18Hxqa0Y?si=YhTXYQRxw1oAWb_c