Allu Vs Konidela : సోషల్ మీడియాలో మెగా, అల్లు ఫ్యాన్స్ రచ్చ!
Allu Vs Konidela : ఆ ఇష్యూ తర్వాత అల్లు అర్జున్‌ను మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ ఏకాకి చేశారు. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కావాల్సి ఉండగా డిసెంబర్ 6కు వాయిదా పడింది.

Allu Arjun’s speech at the event creates buzz, upsets mega fans ( Image Source : Google )
Gossip Garrage : ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసినోడు పవన్ కల్యాణ్. తగ్గేదేలే అంటూ తొడగొట్టేవాడు అల్లుఅర్జున్. ఆ ఇద్దరి హీరోల సినిమాల్లోని ఈ డైలాగ్‌లు చాలా ఫేమస్. ఆ ఇద్దరు హీరోలు సినిమాలు వస్తే ఎంత హడావుడి ఉంటుందో..అంతకు మించి కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు మెగా, అల్లు ఫ్యాన్స్. పోటాపోటీ పోస్ట్‌లు, కామెంట్లతో మెగా అభిమానాలు, అల్లు ఆర్మీ తగ్గేదేలే అంటున్నారు.
ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందో.. ఎందుకు ఈ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ సరైనోడు సక్సెస్ ఈవెంట్‌లో చెప్పను బ్రదర్ అంటూ బన్నీ చెప్పిన కామెంటే దీనికి కారణం అంటున్నారు మెగా ఫ్యాన్స్.
అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ ఎప్పటికీ ఏదో ఒక ఇష్యూతో గొడవ పడుతూనే ఉంటారు. ఏపీ ఎన్నికల సమయంలో వైసీపీ నేత శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా అల్లుఅర్జున్ అతని ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ అల్లుఅర్జున్‌ను ట్విట్టర్‌లో అన్ ఫాలో కొట్టాడు. ప్రత్యర్థుల కోసం పనిచేసేవాడు తమవాడైనా పరాయివాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ కూడా చర్చకు దారి తీసింది.
ఆ ఇష్యూ తర్వాత అల్లు అర్జున్‌ను మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ ఏకాకి చేశారు. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కావాల్సి ఉండగా డిసెంబర్ 6కు వాయిదా పడింది. బయటకు షూటింగ్ పెండింగ్‌లో ఉందని చెప్తున్నా..పుష్ప-2 రిలీజ్ డేట్ ఎక్స్‌డెంట్ కావడం వెనక రీజన్ వేరే ఉందన్న చర్చ జరుగుతోంది.
బెంగళూరు పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇండైరెక్ట్‌గా అల్లు అర్జున్‌పై కామెంట్స్ చేశాడని అల్లు ఆర్మీ గుర్రుగా ఉంది. పవన్ కల్యాణ్ వాస్తవాలనే మాట్లాడారంటూ సపోర్ట్ చేశారు మెగా ఫ్యాన్స్. ఇది మరిచిపోకముందే మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అల్లుఅర్జున్ కూడా ఇండైరెక్ట్‌గా పవన్‌కు కౌంటర్ ఇస్తున్నట్లు మాట్లాడారన్న చర్చకు జరుగుతోంది. ఇష్టమైనోళ్లకి మనం నిలబడగలగాలి. మన ఫ్రెండ్ అనుకో..కావాల్సిన వాళ్లనుకో..నాకిష్టమైతే నేనొస్తా. నా మనసుకు నచ్చితేనే వస్తా. అది మీ అందరికీ తెలుసని..అల్లుఅర్జున్ అనగానే అక్కడున్న అభిమానులంతా కేకలు పెట్టారు.
సుకుమార్ ఫ్యామిలీ పిలవడం వల్లే వచ్చానని అల్లుఅర్జున్ ఇంటెన్షన్ అయినా.. సోషల్ మీడియాలో మాత్రం వైసీపీ నేత శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు పలికిన విషయం గురించి మరోసారి ఆయన తన స్టాండ్ చెప్పారని చర్చ జరుగుతోంది. బన్నీ ఈ కామెంట్స్ ఊరికే చేయలేదని, ఇది మెగా ఫ్యామిలీకి అతడు ఇచ్చిన మాస్ రిప్లై అని అతని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో మరోసారి మెగా ఫ్యాన్స్ వర్సెస్స్ అల్లు ఆర్మీల మధ్య సోషల్ మీడియా వేదికగా రచ్చ జరుగుతుంది.
డిసెంబర్ 6న పుష్ప-2 సినిమా రిలీజ్ టైంలో తమ సత్తా ఏంటో చూపుతామంటూ కామెంట్స్ పెడుతున్నారు బన్నీ ఫ్యాన్స్. సినిమా టికెట్ ధరల విషయంలో పవన్ తప్పకుండా అడ్డుకుంటాడని, అంతేకాదు స్పెషల్ ప్రీమియర్‌షోలు, అదనపు షోలు ఏపీలో ఉండవంటున్నారు. పుష్ప-2 రిలీజ్ సమయంలో ఏం జరగబోతుందో తెలియదు కానీ.. ఇప్పుడైతే సోషల్ మీడియాలో అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ఓ లెవల్‌లో రచ్చ చేస్తున్నారు.
Read Also : Naga Chaitanya : రేసింగ్‌లోకి అక్కినేని నాగచైతన్య.. ఏ టీమ్‌ను కొనుగోలు చేశారంటే..?