Amazon miniTV: అమెజాన్ నుంచి మినీ టీవీ.. వీడియోలు ఫ్రీ

ఇండియాలో ఉండే యూజర్ల కోసం అమెజాన్ కొత్తగా ప్లాన్ చేసింది. 'miniTV' అనే సర్వీస్ ద్వారా ఫ్రీ వీడియో స్ట్రీమింగ్ సర్వీసును లాంచ్ చేసింది. ఇందులో వీడియోలు చూడాలంటే ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ పే చేయాల్సిన అవసరం లేదు.

Amazon miniTV: అమెజాన్ నుంచి మినీ టీవీ.. వీడియోలు ఫ్రీ

Amazon Launches Minitv In India For Free Videos

Updated On : May 16, 2021 / 12:54 PM IST

Amazon miniTV: ఇండియాలో ఉండే యూజర్ల కోసం అమెజాన్ కొత్తగా ప్లాన్ చేసింది. ‘miniTV’ అనే సర్వీస్ ద్వారా ఫ్రీ వీడియో స్ట్రీమింగ్ సర్వీసును లాంచ్ చేసింది. ఇందులో వీడియోలు చూడాలంటే ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ పే చేయాల్సిన అవసరం లేదు.

‘ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ మినీ టీవీని ప్రకటించింది. మినీ టీవీ అనేది ఫ్రీ. యాడ్ సపోర్టెడ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్. అది కూడా అమెజాన్ షాపింగ్ యాప్ లోనే దొరుకుతుందని’ అమెజాన్ బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది.

అమెజాన్ ప్రకారం.. మినీ టీవీ అనేది ప్రొఫెషనల్ క్రియేట్ చేసి క్యూరేటెడ్ కంటెంట్ తో ఉంటుంది. వెబ్ సిరీస్, కామెడీ షోస్, టెక్ న్యూస్, ఫుడ్, బ్యూటీ, ఫ్యాషన్ లాంటివన్నీ అందులో చూడొచ్చు.

ఇంకా టీవీఎఫ్, పాకెట్ యాసెస్ లాంటి స్టూడియోలు, లీడింగ్ కమెడియన్లు ఆశిష్ చంచ్లనీ, అమిత్ భదన, రౌండ్2హెల్, హర్ష్ బెనీవాల్, శ్రుతీ అర్జున్ ఆనంద్, ఎల్విష్ యాదవ్, ప్రజాక్త కోలీ, స్వాగ్గర్ శర్మ, ఆకాశ్ గుప్తా, నిషాంత్ తన్వార్‌లు ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వనున్నారు.

ఇదే కాకుండా అమెజాన్ మినీ టీవీ లేటెస్ట్ ప్రొడక్ట్స్ ల గురించి ట్రాకిన్ టెక్, ఫ్యాషన్, బ్యూటీ ఎక్స్ పర్ట్ లు సెజల్ కుమార్, మాల్వికా సిట్లానీ, జోవితా జార్జ్, ప్రేర్ణ ఛాబ్రా, శివ శక్తి చెప్తుంటారు. ఫుడ్ లవర్స్ కోసం మినీ టీవీలో కబితాస్ కిచెన్, కుక్ విత్ నిషా, గాబుల్ షోలు చేయనున్నారు. రాబోయే నెలల్లో మినీ టీవీ మరిన్ని ప్రత్యేకమైన వీడియోలను యాడ్ చేయనున్నట్లు చెబుతున్నారు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలకు మాదిరిగా దీనికి సబ్ స్క్రిప్షన్ అవసరం లేదు. ఇప్పటి వరకూ దీనిని ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి ఉంచారు.