Top music director : సౌత్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అతడేనా..? సినిమాకి రూ.10కోట్లు..?
ఓ సినిమా విజయం సాధించడంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుంది అనే సంగతి తెలిసిందే. వినసొంపైన పాటలు, సన్నివేశాలకు తగినట్లు బ్యాగ్రౌండ్ స్కోరు ఉంటేనే ఆ సినిమా హిట్ అవుతుంటుంది.
Top music director in South : ఓ సినిమా విజయం సాధించడంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుంది అనే సంగతి తెలిసిందే. వినసొంపైన పాటలు, సన్నివేశాలకు తగినట్లు బ్యాగ్రౌండ్ స్కోరు ఉంటేనే ఆ సినిమా హిట్ అవుతుంటుంది. లేదంటే ఆ చిత్రం ప్రేక్షకుల హృదయాలకు చేరువ అవ్వడం కాస్త కష్టమే. ప్రస్తుతం సౌత్‌లో ఓ మ్యూజిక్ డైరెక్టర్ పేరు బాగా వినిపిస్తోంది. అతడు మరెవరో కాదు.. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander).
కోలీవుడ్‌లోనే కాదు పక్క బాషల్లోనూ ఇతడికి డిమాండ్ మామూలుగా లేదు. ఓ వైపు పాటలకు అద్భుతమైన బాణీలు సమకూరుస్తూనే మరోవైపు నేపథ్య సంగీతంతో పూనకాలు తెప్పిస్తున్నాడు. ఇక హీరోలకు అతడు ఇచ్చే ఎలివేషన్ మ్యూజిక్కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘విక్రమ్’ చిత్రంలో లోకనాయకుడు కమల్‌హాసన్ కు, ‘జైలర్’ సినిమాలో రజినీకాంత్‌కు ఇచ్చిన ఎలివేషన్‌కు తమిళ తంబీలే కాదు ప్రతీ ఒక్కరూ బాగా ఎంజాయ్ చేశారు.
Nabha Natesh : తాగే ఆలోచనతోనే నిద్ర లేస్తాను అంటున్న నభా నటేష్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్..
మా హీరోలకు కూడా ఇలాంటి ఎలివేషన్ మ్యూజిక్ పడితే బాగుండు అని కొందరు హీరోల ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అంటే అందులో అతిశయోక్తి లేదు. అంతలా అనిరుధ్ మ్యూజిక్‌తో మైమరిపిస్తున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఒక్కొ సినిమాకి రూ.8 కోట్లు తీసుకుంటుండగా అతడిని మించి అనిరుధ్ ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ.10కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సౌత్‌లో ఉన్న సంగీత దర్శకుల్లో టాప్ అనిరుధ్ రవిచందర్ అని ఆ వార్తల సారాంశం.
2012లో ధనుష్‌తో కలిసి ‘వై దిస్ కొలవెరి డి’తో సినీరంగ ప్రవేశం చేసిన 32 ఏళ్ల అనిరుధ్ చేతిలో ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జవాన్’, తలపతి విజయ్ నటిస్తున్న ‘లియో’తో పాటు లోకనాయకుడు కమల్‌హాసన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇండియన్-2’, అజిత్ నటిస్తున్న ‘విడి ముయార్చి’లతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ సినిమాలు ఉన్నాయి. వీటిలో ‘జవాన్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇది హిందీలో అనిరుధ్‌కు తొలి చిత్రం. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘జిందా బందా’ పాట బాలీవుడ్లో సంచలనాలు సృష్టిస్తోంది.
Nelson Dilip Kumar : రజినీకాంత్ – విజయ్ ఒకే సినిమాలో.. నా డ్రీమ్ అదే.. జైలర్ డైరెక్టర్ నెల్సన్..