Anupama Parameswaran: సింగిల్ కాదంటూ.. తన లవ్ గురించి ట్విస్ట్ ఇచ్చిన అనుపమ!

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగు నాట ఎలాంటి క్రేజ్, ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుందో అందరికీ తెలిసిందే. ‘అ.. ఆ..’ సినిమాతో తెలుగులో....

Anupama Parameswaran: సింగిల్ కాదంటూ.. తన లవ్ గురించి ట్విస్ట్ ఇచ్చిన అనుపమ!

Anupama Parameswaran Shocking Comments On Her Relationship

Updated On : May 30, 2022 / 4:25 PM IST

Anupama Parameswaran: మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగు నాట ఎలాంటి క్రేజ్, ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుందో అందరికీ తెలిసిందే. ‘అ.. ఆ..’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, తన అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ బ్యూటీ నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అవుతుండటంతో ఈమె టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్‌గా మారిపోయింది. అయితే అనపమ నటించిన సినిమాల్లో ఆమె పాత్రలు చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో అభిమానులు ఆమెకు తమ గుండెల్లో గుడి కట్టుకున్నారు.

Anupama Parameswaran : అనుపమకి కోపం తెప్పించిన ఆకతాయిలు.. ఏం చేశారో తెలుసా??

ఇక ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అనుపమ పరమేశ్వరన్, తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. తాజాగా ఆమె తన రిలేషన్‌షిప్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందాల అనుపమ సింగిల్ కాదంటూ తన అభిమానులకు షాకిచ్చింది. తాను సింగిల్ కాదని.. మింగిల్ అయ్యానని చెప్పుకొచ్చింది.

Anupama Parameswaran : ఆ నంబర్ నాది కాదు.. నా పేరు వాడుకొని మోసం చేస్తున్నారు..

తాను ఎప్పుడైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లను చూస్తే తనకు చాలా ముచ్చటగా అనిపిస్తుందని.. అందుకే తాను కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అయితే తన లవ్ విషయానికి వస్తే.. తాను సింగిల్ కాదని.. తాను మింగిల్ అని చెప్పింది. అంతేగాక.. తన రిలేషన్ గురించి తనకు ఏం అర్థం కావడం లేదని.. తాను ప్రేమిస్తున్న వ్యక్తి తనని ప్రేమిస్తున్నాడో లేదో కూడా తెలియదని.. తనది వన్‌సైడ్ లవ్ అని ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికి కుర్రకారు గుండెల్లో గుడి కట్టించుకున్న అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు వన్‌సైడ్ లవ్‌లో ఉండటంతో ఆమె అభిమానులు దీనికి సంబంధించిన పూర్తి విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తిని చూపుతున్నారు.