Athadu : ‘అతడు’లో మహేష్ తాత పాత్రకు ఆ స్టార్ హీరోని అడిగితే.. బ్లాంక్ చెక్ ఇచ్చినా చేయనని చెప్పడంతో..

రీ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించగా మురళీ మోహన్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో అప్పటి సంగతులు పంచుకున్నారు.

Athadu : ‘అతడు’లో మహేష్ తాత పాత్రకు ఆ స్టార్ హీరోని అడిగితే.. బ్లాంక్ చెక్ ఇచ్చినా చేయనని చెప్పడంతో..

Athadu

Updated On : July 26, 2025 / 5:37 PM IST

Athadu : మురళీ మోహన్ నిర్మాణంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు – త్రిష జంటగా తెరకెక్కిన అతడు సినిమా ఆగస్టు 9న రీ రిలీజ్ కాబోతుంది. థియేటర్స్ లో రిలీజయినప్పుడు యావరేజ్ గా నిలిచినా తర్వాత ఈ సినిమా క్లాసిక్ గా నిలిచింది. అతడు రీ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించగా మురళీ మోహన్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో అప్పటి సంగతులు పంచుకున్నారు.

మురళీ మోహన్ మాట్లాడుతూ.. అతడు సినిమాలో నాజర్ గారు పోషించిన పాత్రకి శోభన్ బాబు గారిని అనుకున్నాం. ఆ పాత్ర కోసం ఆయనకు బ్లాంక్ చెక్‌ను కూడా పంపించాం. కానీ శోభన్ బాబు గారు మా ఆఫర్‌ను తిరస్కరించారు. నేను హీరోగానే అందరికీ గుర్తుండాలి కానీ ఇలా ఇంకో పాత్రలో నన్ను గుర్తు పెట్టుకోకూడదు అని ఆయన ఆ పాత్ర రిజెక్ట్ చేశారు అని తెలిపారు.

Also Read : Ruchi Gujjar : నిర్మాతను చెప్పుతో కొట్టిన నటి.. మోదీ నక్లెస్ తో పాపులర్ అయిన భామ..

శోభన్ బాబు రిజెక్ట్ చేసిన తర్వాత నాజర్ ని సెలెక్ట్ చేసుకున్నారు. నాజర్ మహేష్ తాత పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. సినిమాలో తాత – మనవడు ఎమోషన్ బాగా పండింది.

Athadu Movie Mahesh Babu Grand Father Nassar Character Rejected by Star Hero

ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత కృష్ణ, శోభన్ బాబు కొన్నేళ్ల పాటు సినీ పరిశ్రమను ఏలిన సంగతి తెలిసిందే. మిగిలిన హీరోలు అంతా హీరో కెరీర్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వేషాలు వేశారు కానీ శోభన్ బాబు మాత్రం హీరోగా ఉండగానే కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టి సినిమాలకు దూరమయ్యారు.