Bahubali : రాజ్యసభ ఎంపీలందరికీ ‘బాహుబలి’ ప్రత్యేక ప్రదర్శన..
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాని రాజ్యసభ సెక్రటేరియట్ రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రదర్శించనున్నారు. రాజ్యసభలో ఉండే వివిధ రాష్ట్రాలకి చెందిన...

Bahubali
Bahubali : ఇటీవల కాలంలో మన తెలుగు సినిమాలు దేశ వ్యాప్తంగా మంచి విజయాన్ని సాధిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ని కూడా బీట్ చేస్తున్నాయి. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా మన తెలుగు సినిమాలని పొగుడుతున్నారు. తాజాగా మన తెలుగు సినిమాకి మరో గౌరవం దక్కనుంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాని రాజ్యసభ సెక్రటేరియట్ రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రదర్శించనున్నారు.
RRR : ‘ఆర్ఆర్ఆర్’కి పైరసి దెబ్బ.. ఆ సైట్‌లో అప్పుడే సినిమా..
రాజ్యసభలో ఉండే వివిధ రాష్ట్రాలకి చెందిన ఎంపీలందరి మధ్య స్నేహం ఉండాలని, భాష భావం ఉండకూడదని, హిందీ మాట్లాడే మరియు ఇతర భాష మాట్లాడే వ్యక్తుల మధ్య భాషా మార్పిడిని ప్రోత్సహించాలని రాజ్యసభ భావించింది. ఇందుకు గాను దేశంలోని వివిధ భాషల నుంచి కొన్ని మంచి సినిమాలని ఎంపిక చేసి ప్రదర్శించనున్నారు. ఇందులో భాగంగా తెలుగు నుంచి ‘బాహుబలి’ సినిమాని ప్రదర్శించనున్నారు. ఈ మేరకు రాజ్యసభ ఎంపీలందరికీ ఆహ్వానం అందింది. ఏప్రిల్ 1న న్యూ ఢిల్లీ మహదేవ్ రోడ్డులోని ఫిలింస్ డివిజన్ ఆడిటోరియంలో ఈ ప్రదర్శన ఉండబోతుంది. దీనికి ఎంపీలంతా హాజరవనున్నారు.