Balagam Movie: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన బలగం.. అంత లేదంటూ ట్వీట్ చేసిన హీరోహీరోయిన్!

టాలీవుడ్‌లో రీసెంట్‌గా వచ్చిన ‘బలగం’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. చిన్న సినిమాగా వచ్చిన బలగం, బాక్సాఫీస్ వద్ద సర్‌ప్రైజ్ హిట్‌గా నిలవడమే కాకుండా, కలెక్షన్ల పరంగా అదిరిపోయే వసూళ్లను రాబట్టి నిర్మాతలకు లాభాల పంటను తెచ్చిపెట్టింది. కమెడియన్ వేణు వెల్దండ డైరెక్టర్‌గా మారి చేసిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

Balagam Movie: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన బలగం.. అంత లేదంటూ ట్వీట్ చేసిన హీరోహీరోయిన్!

Balagam Movie Actors Have No Idea Of OTT Streaming

Updated On : March 24, 2023 / 4:30 PM IST

Balagam Movie: టాలీవుడ్‌లో రీసెంట్‌గా వచ్చిన ‘బలగం’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. చిన్న సినిమాగా వచ్చిన బలగం, బాక్సాఫీస్ వద్ద సర్‌ప్రైజ్ హిట్‌గా నిలవడమే కాకుండా, కలెక్షన్ల పరంగా అదిరిపోయే వసూళ్లను రాబట్టి నిర్మాతలకు లాభాల పంటను తెచ్చిపెట్టింది. కమెడియన్ వేణు వెల్దండ డైరెక్టర్‌గా మారి చేసిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

Balagam Movie: అర్ధరాత్రి సర్‌ప్రైజ్ ఇవ్వనున్న ‘బలగం’ మూవీ..!

ఇక ఈ సినిమా థియేటర్స్‌లో సందడి చేస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారు. కాగా, అందరికీ సర్‌ప్రైజ్ ఇస్తూ ఈ సినిమా ఓటీటీలో అర్థరాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన సంగతి చాలా మందికి తెలయదు. బలగం సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్‌లకు కూడా ఈ విషయంపై ఎలాంటి అవగాహన లేదని వారు తెలిపారు. నిన్న బలగం సినిమా ఓటీటీలో వస్తోందనే వార్తపై వారు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.

Balagam Movie Collections : అదిరిపోయిన బలగం సినిమా కలక్షన్స్.. ఫుల్ ప్రాఫిట్స్..

బలగం సినిమా థియేటర్లలో మంచి టాక్‌తో దూసుకుపోతుంది.. అందరూ థియేటర్లలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని.. ఓటీటీ వార్తలను ఎవరూ నమ్మవద్దని హీరో ప్రియదర్శి సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. అయితే, సినిమా నిజంగానే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేయడంతో తాను చేసిన కామెంట్ నిజమైతే బాగుండు అంటూ ప్రియదర్శి చెప్పుకొచ్చాడు. ఇక హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్‌కు కూడా ఈ విషయం తెలియదట. దీంతో బలగం సినిమా ఓటీటీ రిలీజ్ అనేది ప్రేక్షకులతో పాటు ఆ సినిమాలో నటించిన నటీనటులకు కూడా సర్‌ప్రైజ్ అనే చెప్పాలి.