Balagam Movie: ప్రేక్షకులకు ‘బలగం’ చిత్ర యూనిట్ అదిరిపోయే ఆఫర్.. ఏమిటో తెలుసా?
టాలీవుడ్‌లో కమెడియన్ నుండి దర్శకుడిగా ‘బలగం’ మూవీతో మారుతున్నాడు వేణు. సినిమాల్లో, జబర్దస్త్ కామెడీ షోలో తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వేణు, దర్శకుడిగా ఓ సినిమాను తెరకెక్కించి, ఇప్పుడు ప్రేక్షకుల ముందు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్‌లతో పాటు భారీ క్యాస్టింగ్ నటిస్తుండగా, ఈ సినిమాను మార్చి 3న భారీ స్థాయిలో రిలీజ్‌కు సిద్ధం చేశారు.

Balagam Movie To Have Low Ticket Prices
Balagam Movie: టాలీవుడ్‌లో కమెడియన్ నుండి దర్శకుడిగా ‘బలగం’ మూవీతో మారుతున్నాడు వేణు. సినిమాల్లో, జబర్దస్త్ కామెడీ షోలో తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వేణు, దర్శకుడిగా ఓ సినిమాను తెరకెక్కించి, ఇప్పుడు ప్రేక్షకుల ముందు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్‌లతో పాటు భారీ క్యాస్టింగ్ నటిస్తుండగా, ఈ సినిమాను మార్చి 3న భారీ స్థాయిలో రిలీజ్‌కు సిద్ధం చేశారు.
Balagam : రిలీజ్ కి ముందే యాత్రలు చేస్తున్న దిల్ రాజు.. బలగం మూవీ!
ఇటీవల ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను సిరిసిల్లలో నిర్వహించగా మంత్రి కేటీఆర్, ‘డీజే టిల్లు’ ఫేం సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా వచ్చి ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, ట్రైలర్స్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. కాగా, ఈ సినిమా రిలీజ్ రోజున చిత్ర యూనిట్ ఓ అదిరిపోయే ఆఫర్‌ను ప్రేక్షకులు అందజేస్తోంది.
Balagam : సిద్దు జొన్నలగడ్డ, ప్రియదర్శి తెలంగాణ గర్వపడేలా చేస్తున్నారు.. మంత్రి కేటిఆర్!
ఈ సినిమా టికెట్ రేటును కేవలం రూ.112గా ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. అన్ని మల్టీప్లెక్స్‌లలో ఈ సినిమా టికెట్ రేట్ ఒకేవిధంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం రిలీజ్ రోజున మాత్రమే ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఏదేమైనా ఎమోషనల్ కంటెంట్‌తో వస్తున్న బలగం చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులకు తగ్గిన టికెట్ రేట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.