Balakrishna : అదిరిపోయిన బాలయ్య బాబు ఫస్ట్ యాడ్.. ఆయన రేంజ్ కి తగ్గట్టే ఉందిగా..

ఇప్పటివరకు తన కెరీర్ లో ఒక్క యాడ్ కూడా చేయని బాలయ్య తాజాగా ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి యాడ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ యాడ్ లాంచ్ కూడా గ్రాండ్ గా చేశారు. అలాగే యాడ్ ని కూడా బాలయ్య రేంజ్ కి తగ్గట్టు.................

Balakrishna : అదిరిపోయిన బాలయ్య బాబు ఫస్ట్ యాడ్.. ఆయన రేంజ్ కి తగ్గట్టే ఉందిగా..

Balakrishna first advertisment goes viral

Updated On : October 28, 2022 / 10:52 AM IST

Balakrishna :  బాలకృష్ణ గత సంవత్సరం నుంచి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అఖండ సినిమా ఇట్ అవ్వడం, 100 కోట్ల కలెక్షన్స్ రావడం, అన్ స్టాపబుల్ షో కూడా భారీ హిట్ అవ్వడం, ఇటీవలే సీజన్ 2 కూడా గ్రాండ్ గా లాంచ్ అవ్వడం, వీర సింహా రెడ్డి సినిమా టీజర్ తో సినిమాపై అంచనాలు భారీగా ఉండటం.. ఇలా బాలయ్య బాబు ఫుల్ జోష్ లో ఉన్నారు. అన్ని వైపులా పాజిటివ్ గా ఉండటంతో బాలయ్య దూసుకుపోతున్నారు. తాజాగా మరో ప్రాజెక్టుతో అందర్నీ ఆశ్చర్యపరిచారు బాలయ్య.

ఇప్పటివరకు తన కెరీర్ లో ఒక్క యాడ్ కూడా చేయని బాలయ్య తాజాగా ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి యాడ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ యాడ్ లాంచ్ కూడా గ్రాండ్ గా చేశారు. అలాగే యాడ్ ని కూడా బాలయ్య రేంజ్ కి తగ్గట్టు డిజైన్ చేశారు. సాయిప్రియ డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ వారు కొత్తగా కట్టే ప్రాజెక్టు కోసం బాలయ్య బాబుతో యాడ్ చేశారు. అలాగే వారి రియల్ ఎస్టేట్ కంపెనీకి కూడా యాడ్ చేశారు. గురువారం సాయంత్రం ఈ యాడ్ లాంచ్ ప్రోగ్రాం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

ఇక ఈ యాడ్ లో బాలయ్యని చాలా పవర్ ఫుల్ గా, పవర్ ఫుల్ డైలాగ్స్ తో చూపించారు. ఫ్లయిట్ లోంచి దిగి కాస్ట్లీ కారు ఎక్కి జనాల మధ్యకి బాలకృష్ణ వచ్చినట్టు చూపించారు. ఈ యాడ్ లో.. ”కొందరు నీళ్లలాగా పల్లానికి కాదు, రాకెట్ లాగా పైకి దూసుకుపోతారు. ప్రపంచంతో నడవరు, ప్రపంచానికి నడక నేర్పిస్తారు. ఒంటరిగా గెలవడం కాదు, వెంటున్న అందర్నీ గెలిపిస్తారు. బంగారంలా తరిగిపోరు, వజ్రంలా వెలిగిపోతారు. లెజెండ్ లా నిలిచిపోతారు. ఆ కొందరిలో మీరు ఒకరైతే మీ కోసమే 116 పారామౌంట్, లివ్ లైక్ ఏ లెజెండ్, ఏ ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టు అఫ్ సాయి ప్రియా గ్రూప్”.. అంటూ తనదైన మాస్ స్టైల్ లో అదరగొట్టారు. దీంతో ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Puri Jagannadh : పూరి ఇంటి వద్ద భద్రత.. కోర్టుకి వెళ్తామంటున్న డిస్ట్రిబ్యూటర్లు..

బాలయ్య బాబు మొదటి సారి యాడ్ చేయడంతో అభిమానులు, ప్రేక్షకులు కూడా ఈ యాడ్ ని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మరో యాడ్ లో ఒక పాపతో కలిసి బాలయ్య బొమ్మల ఇల్లు కడుతుంటే గాలి వచ్చి పడిపోద్ది ఆ తర్వాత దానికి రక్షణగా ఒక గాజు బాక్స్ ని పెడతారు. ఇది క్లాసిక్ యాడ్ లా ఆ రియల్ ఎస్టేట్ కంపెనీని ప్రమోట్ చేస్తూ తీశారు. ఇలా మొదటిసారి రెండు యాడ్స్ చేసి అభిమానుల్లో మరింత జోష్ ని పెంచారు బాలయ్య.