Unstoppable Episode 6 Promo : హీరోయిన్ అవ్వాలంటే కొన్ని కాంప్రమైజ్‌లు తప్పవు.. అన్‌స్టాపబుల్‌లో బాలయ్య..

అన్‌స్టాపబుల్‌ రెండో సీజన్ లో ఆరో ఎపిసోడ్ కి ముగ్గురు భామలని తీసుకొచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు ఇప్పటి హీరోయిన్ రాశిఖన్నాని తీసుకొచ్చారు. ఈ ముగ్గురితో కలిసి బాలయ్య సందడి చేశారు. ఈ ముగ్గురితో చేసిన ఎపిసోడ్......................

Unstoppable Episode 6 Promo : హీరోయిన్ అవ్వాలంటే కొన్ని కాంప్రమైజ్‌లు తప్పవు.. అన్‌స్టాపబుల్‌లో బాలయ్య..

Balakrishna Unstoppable Episode 6 Promo released

Updated On : December 22, 2022 / 10:24 AM IST

Unstoppable Episode 6 Promo :  బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్‌ షో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అన్‌స్టాపబుల్‌ రెండో సీజన్ లో ఇప్పటికే అయిదు ఎపిసోడ్ లు పూర్తికాగా త్వరలో ఆరో ఎపిసోడ్ రిలీజ్ కానుంది. ప్రభాస్ తో షూట్ పూర్తయిన ఆ ఎపిసోడ్ ని న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30న రిలీజ్ కానుంది. ఈ లోపే బాలయ్య బాబు మరో ఎపిసోడ్ తో రానున్నాడు. తాజాగా ఆరో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది.

అన్‌స్టాపబుల్‌ రెండో సీజన్ లో ఆరో ఎపిసోడ్ కి ముగ్గురు భామలని తీసుకొచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు ఇప్పటి హీరోయిన్ రాశిఖన్నాని తీసుకొచ్చారు. ఈ ముగ్గురితో కలిసి బాలయ్య సందడి చేశారు. ఈ ముగ్గురితో చేసిన ఎపిసోడ్ డిసెంబర్ 23న రిలీజ్ కానుండగా ప్రస్తుతం ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు.

ఈ ఎపిసోడ్ లో బాలయ్య ముగ్గురు భామలతో కలిసి డ్యాన్స్ వేశారు. రాశిఖన్నాని తెగ పొగిడేసాడు బాలయ్య. ఆమె స్మైల్ కి పడిపోయాను అంటూ సరదాగా రాశిని ఆటపట్టించారు. రాశి నటించిన ఊహలు గుసగుసలాడే సినిమాలోని సాంగ్ పాడి అలరించింది. అనంతరం సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగి జయప్రద, జయసుధని ఇరుకున పడేసారు బాలయ్య. ప్రస్తుతం బాలయ్య త్వరలో వీరసింహ రెడ్డి సినిమాతో రానున్నాడని తెలిసిందే. దీని గురించి మాట్లాడుతూ.. నేను, శృతి ప్రస్తుతం హాట్ పెయిర్ అఫ్ ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.

Sreeleela : ఓ వైపు సినిమాలు.. ఓ వైపు చదువు.. హీరోయిన్ శ్రీలీల ఏం చదువుతుందో తెలుసా..??

అలాగే ఈ ముగ్గురి హీరోయిన్స్ ని కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా అడిగారు. హీరోయిన్ అవ్వాలంటే పరిశ్రమలో కొన్ని కాంప్రమైజ్ లు తప్పవు, హీరోయిన్ సెంట్రిక్ సినిమాలపై డబ్బులు పెట్టడానికి ప్రొడ్యూసర్లు 100 సార్లు ఆలోచిస్తారు లాంటి కాంట్రవర్సీ ప్రశ్నలు బాలయ్య అడిగారు. మరి దీనికి ఈ హీరోయిన్స్ ఏం సమాధానం చెప్తారో ఎపిసోడ్ లో చూడాల్సిందే.