Bellamkonda Srinivas : బాలీవుడ్ లో చరణ్, ఎన్టీఆర్ పేర్లను వాడేసుకుంటున్న బెల్లంకొండ శ్రీనివాస్
RRR సినిమా ఆతర్వాత చరణ్, ఎన్టీఆర్ బాలీవుడ్ లో, నార్త్ సైడ్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోలే చరణ్, ఎన్టీఆర్ లను తమ సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ అడుగుతున్నారంటే ఏ రేంజ్ లో వాళ్లకు అక్కడ ఫేమ్ ఉందో అర్ధమవుతుంది. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా వాళ్ళ ఫేమ్ ని వాడుకుంటున్నాడు.

Bellamkonda Srinivas using NTR and haran fame in Bollywood for Chatrapathi promotions
Bellamkonda Srinivas : రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఛత్రపతి(Chatrapathi)ని 18 ఏళ్ళ తర్వాత ఇప్పుడు హిందీలో(Hindi) రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) హీరోగా, VV వినాయక్(VV Vinayak) దర్శకత్వంలో హిందీలో ఛత్రపతి పేరుతోనే రీమేక్ చేస్తున్నారు. ఇందులో నుశ్రుత్ భరూచా(Nushrratt Bharuccha) హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు.
ఛత్రపతి సినిమా మే 12న రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కి ఇది హిందీలో ఫస్ట్ సినిమా కావడంతో మరింత ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే తన డబ్బింగ్ సినిమాల ద్వారా అక్కడి ప్రేక్షకులకు చేరువయ్యాడు శ్రీనివాస్. ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా చరణ్, ఎన్టీఆర్ గురించి మాట్లాడాడు.
RRR సినిమా ఆతర్వాత చరణ్, ఎన్టీఆర్ బాలీవుడ్ లో, నార్త్ సైడ్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోలే చరణ్, ఎన్టీఆర్ లను తమ సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ అడుగుతున్నారంటే ఏ రేంజ్ లో వాళ్లకు అక్కడ ఫేమ్ ఉందో అర్ధమవుతుంది. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా వాళ్ళ ఫేమ్ ని వాడుకుంటున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాకు మా నన్నే నిర్మాత. అది చాలా పెద్ద హిట్ సినిమా, అది వినాయక్ సర్ మొదటి సినిమా. నా చిన్నప్పట్నుంచి ఎన్టీఆర్, చరణ్ లతో స్నేహం ఉంది. ఇప్పుడు కూడా మేము మంచి స్నేహితులం. కానీ ఎవరికి వాళ్ళు సినిమాలతో బిజీ అయిపోవడం వల్ల ఎక్కువగా కలవట్లేదు. కానీ కలిస్తే చాలా క్లోజ్ గా ఉంటాము అని తెలిపాడు.
Adipurush : జై శ్రీరామ్.. ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏకంగా 70 దేశాల్లో ట్రైలర్ రిలీజ్..
దీంతో ఛత్రపతి సినిమాకు ఇలా ఎన్టీఆర్, చరణ్ ని కూడా వాడేసుకుంటున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్ అని కామెంట్స్ చేస్తున్నారు. చరణ్, ఎన్టీఆర్ తనకు బాగా క్లోజ్ అని చెప్పుకొని అక్కడి ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ట్రై చేస్తున్నాడు శ్రీనివాస్, ఏది ఏమైనా సినిమా హిట్ అయితే అదే హ్యాపీ అని అంతా భావిస్తున్నారు.