Bhagavanth Kesari : భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్.. ‘గ‌ణేష్ అంథెమ్’కి టైం ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

నంద‌మూరి బాల‌కృష్ణ (Balakrishna) న‌టిస్తున్న చిత్రం భగవంత్ కేసరి(Bhagavanth Kesari). అనిల్ రావిపూడి (Anil Ravipudi) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌(Kajal Aggarwal) హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Bhagavanth Kesari : భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్.. ‘గ‌ణేష్ అంథెమ్’కి టైం ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

Bhagavanth Kesari first Single

Updated On : August 25, 2023 / 2:55 PM IST

Bhagavanth Kesari first Single : నంద‌మూరి బాల‌కృష్ణ (Balakrishna) న‌టిస్తున్న చిత్రం భగవంత్ కేసరి(Bhagavanth Kesari). అనిల్ రావిపూడి (Anil Ravipudi) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌(Kajal Aggarwal) హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీలీల(Sreeleela) కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విల‌న్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun rampal)న‌టిస్తోండ‌గా థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా.. చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Pushpa 2 : నేషనల్ అవార్డుతో సీక్వెల్ పై మరింత అంచనాలు.. రిలీజ్‌ కోసం ఆ డేట్ ఫిక్స్ చేశారట..!

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా ఫ‌స్ట్ సింగిల్ విడుద‌లకు ముహూర్తాన్ని ఖ‌రారు చేసింది. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా గ‌ణేష్ అంథెమ్ (Ganesh Anthem) ను సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తుండ‌డంతో ఈ పాట‌పై మంచి అంచ‌నాలు ఉన్నాయి.

Nani : ఆ సినిమా అవార్డు గెలుచుకోనందుకు బాధ పడుతున్న నాని.. ఏ మూవీ తెలుసా..?

ఇదిలా ఉంటే ఈ సినిమాకి భారీగా బిజినెస్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. బాల‌య్య గ‌త చిత్రాలు అఖండ‌, వీర సింహ‌రెడ్డి సినిమాలు 100 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించ‌డంతో ఈ సినిమాకు భారీగానే బిజినెస్ జ‌రిగింది. థ్రియేట్రిక‌ల్ రైట్స్ దాదాపు 70 కోట్ల‌కు అమ్ముడుపోయాయ‌ట‌. ఇక మిగిలిన డిజిట‌ల్‌, శాటిలైట్ రైట్స్‌తో నిర్మాత‌ల‌కు మరింత లాభ‌మే కానుంది. ఈ చిత్రంతో బాల‌య్య బాబు 100 కోట్ల హ్యాట్రిక్ కొడ‌తాడో లేదో చూడాలి.