Bhagavanth Kesari : న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర.. భగవంత్ కేసరి ఫ్లాష్ మాబ్.. వీడియో వైరల్

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర భగవంత్ కేసరి సాంగ్ అభిమానుల ఫ్లాష్ మాబ్ చూశారా..?

Bhagavanth Kesari : న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర.. భగవంత్ కేసరి ఫ్లాష్ మాబ్.. వీడియో వైరల్

Bhagavanth Kesari Ganesh Anthem song flash mob at times square new york

Updated On : September 18, 2023 / 4:04 PM IST

Bhagavanth Kesari : నంద‌మూరి బాల‌కృష్ణ (Balakrishna), కాజ‌ల్ అగ‌ర్వాల్‌ (Kajal Aggarwal), శ్రీలీల (Sreeleela) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మూవీ ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే నెల రిలీజ్ ఉండడంతో మూవీ టీం షూటింగ్ పూర్తి చేసే పనిలో పడింది. ప్రస్తుతం సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వనున్నట్లు తెలుస్తుంది.

Bhagavanth Kesari : రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ ఇచ్చేసిన ‘భగవంత్ కేసరి’.. దసరాకి రావడం..!

కాగా ఈ మూవీ నుంచి ఇటీవల ‘గణేష్’ సాంగ్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ దగ్గర ఈ సాంగ్ కి ఫ్లాష్ మాబ్ కట్టి అమెరికన్స్ ని అభిమానులు ఫిదా చేశారు. అందుకు సంబంధించిన చిన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. మరి ఆ వీడియోని ఒకసారి మీరుకూడా చూసేయండి.

Ganapath : దసరా రేసులో మరో పాన్ ఇండియా సినిమా.. విజయం ఎవరిది..?

ఇది ఇలా ఉంటే, ఈ మూవీని చెప్పిన డేట్ కి రిలీజ్ చేయడం కష్టం అంటూ రెండు రోజులు నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ తో బాలయ్య పాలిటిక్స్ పై వెళ్లాడని, దీంతో బ్యాలన్స్ షూట్ కంప్లీట్ అవ్వడం కష్టమని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్, మరో పక్క థమన్ ఆర్ఆర్ వర్క్స్, డబ్బింగ్ వర్క్స్.. ఇలా అన్ని ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ మూవీ రావడంలో ఎటువంటి సందేహం లేదు. చిత్ర యూనిట్ కూడా నేడు కొత్త పోస్టర్ తో అది కన్ఫార్మ్ చేశారు.