Bhanu Sri : బిగ్ బాస్ టీమ్ వల్ల నేను బాధపడ్డా.. ముందు ఓకే చెప్పి తర్వాత వద్దని..
తాజాగా భానుశ్రీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలను తెలిపింది.

Bhanu Sri Tells why She Leaves Dhee Show Because of Bigg Boss
Bhanu Sri : సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకొన్న భానుశ్రీ బిగ్ బాస్ లో పాల్గొని బాగా ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొంది భాను. ఆ తర్వాత పలు టీవీ షోలు, సినిమాలతో బిజీగానే ఉంది. తాజాగా భానుశ్రీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలను తెలిపింది.
అయితే భానుశ్రీ బిగ్ బాస్ తర్వాత ఢీ షోలో మెంటర్ గా చేసింది కానీ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత మధ్యలోనే వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటో భానుశ్రీ ఇంటర్వ్యూలో తెలిపింది.
భానుశ్రీ మాట్లాడుతూ.. బిగ్ బాస్ తర్వాత ఢీ ఆఫర్ వస్తే బిగ్ బాస్ టీమ్ వాళ్లకు చెప్పే చేశా. కానీ అయిదు ఎపిసోడ్స్ అయ్యాక ఫోన్ చేసి మీరు ఆ షో చేయొద్దు అన్నారు. నేను మీకు చెప్తే ఓకే అన్నారని కదా చేస్తున్నాను అని అడిగితే మా రీజన్స్ మాకు ఉన్నాయి, అగ్రిమెంట్ లో మీరు వేరే ఛానల్ షోలు చేయొద్దు అని ఉంది కదా అన్నారు. దాంతో మధ్యలో వెళ్ళిపోయా. నేను డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టి ఢీలో ఒక డ్యాన్స్ టీమ్ కి మెంబర్ అంటే హ్యాపీగా ఫీల్ అయ్యా. కానీ ఇలా మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చినందుకు చాలా బాధపడ్డాను అని తెలిపింది.