NTR Properties : వామ్మో ఎన్టీఆర్ కి ఇన్ని వందల కోట్ల ఆస్తులున్నాయా? ప్రైవేట్ జెట్ కూడా? ఎన్టీఆర్ మీద బాలీవుడ్ మీడియా వార్తలు..
వార్ 2 టీజర్ తర్వాత బాలీవుడ్ మీడియా అంతా ఎన్టీఆర్ గురించే మాట్లాడుతుంది.

Bollywood Media Wrote about NTR Properties after war 2 Teaser Released
NTR Properties : ఎన్టీఆర్ RRR తర్వాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ లో వార్ 2 సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇటీవలే ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు వార్ 2 నుంచి స్పెషల్ ఎన్టీఆర్ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఇందులో ఎన్టీఆర్ ని ఓ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్ లతో చూపించారు. ఎన్టీఆర్ లుక్స్ కూడా అదిరిపోయాయి. దీంతో ఎన్టీఆర్ ఒక్కసారిగా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు.
వార్ 2 టీజర్ తర్వాత బాలీవుడ్ మీడియా అంతా ఎన్టీఆర్ గురించే మాట్లాడుతుంది. మొదటిసారి బాలీవుడ్ స్పై యూనివర్స్ లో టాలీవుడ్ హీరో నటిస్తుండటం, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్, ఆ రేంజ్ ఎలివేషన్స్ కావడంతో ఎన్టీఆర్ గురించి బోలెడన్ని ఆర్టికల్స్ రాస్తున్నారు బాలీవుడ్ మీడియా. తాజాగా ఎన్టీఆర్ ఆస్తుల గురించి కూడా రాస్తున్నారు.
బాలీవుడ్ మీడియా ప్రకారం ఎన్టీఆర్ కి 450 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయట. ఎన్టీఆర్ దగ్గర ఖరీదైన వాచ్ లు, కార్లు అయితే ఉన్నాయని అందరికి తెలిసిందే. కానీ ఎన్టీఆర్ దగ్గర ప్రైవేట్ జెట్ కూడా ఉందట. 80 కోట్ల రూపాయల విలువ చేసే ప్రైవేట్ జెట్ ఎన్టీఆర్ కి ఉందని బాలీవుడ్ మీడియా అంటుంది. అలాగే ఓ ఫామ్ హౌజ్, విల్లా, బంగ్లాలు ఉన్నాయని, 5 కోట్ల విలువైన లాంబోర్గిని కారు, 2 కోట్ల రేంజ్ రోవర్, కోటి విలువ చేసే బీఎండబ్ల్యూ, పోర్షే కార్లు ఉన్నాయని తెలిపారు. ఇక ఎన్టీఆర్ దగ్గర 2 కోట్ల రూపాయల ఖరీదు చేసే వాచీలు మాత్రం 2 ఉన్నాయని తెలుసు. లక్షల విలువ చేసే వాచ్ లు కూడా చాలానే ఉన్నాయి ఎన్టీఆర్ వద్ద.
ఇక ఎన్టీఆర్ వార్ 2 సినిమాకు 60 కోట్లు తీసుకుంటున్నాడట. ఎన్టీఆర్ సినిమాలతో పాటు యాడ్స్ తో కూడా బాగానే సంపాదిస్తారు. ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు వైరల్ అవ్వడంతో అసలు ఎన్టీఆర్ కి నిజంగానే 450 కోట్ల ఆస్తులు ఉన్నాయా, ఎన్టీఆర్ వద్ద ప్రైవేట్ జెట్ ఉందా అని అభిమానులే ఆశ్చర్యపోతున్నారు. మరి బాలీవుడ్ మీడియాకే తెలియాలి.
Also Read : Varun Sandesh – Vithika Sheru : భార్యతో అరుణాచలంలో వరుణ్ సందేశ్.. ఫొటోలు చూసారా?