Suriya : బోయపాటి నెక్స్ట్ మూవీ తమిళ హీరో ‘సూర్య’తోనా..?

బోయపాటి శ్రీను తన నెక్స్ట్ మూవీని సూర్యతో చేయబోతున్నాడా..? తెలుగు, తమిళ మీడియాలో..

Suriya : బోయపాటి నెక్స్ట్ మూవీ తమిళ హీరో ‘సూర్య’తోనా..?

boyapati srinu movie with Suriya is ready to announce rumours

Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతుంది అంటూ ఎప్పటి నుంచో వినిపిస్తున్న వార్త. గతంలో ఒక ఇంటర్వ్యూలో బోయపాటి.. సూర్యతో సినిమా చేయాలని ఉంది అని మాట్లాడడంతో ఈ కాంబినేషన్ న్యూస్ తెర పైకి వచ్చింది. ఈ కలయిక పై ఆడియన్స్ లో కూడా మంచి బజ్ నెలకుంది. వీరిద్దరి కలయికలో ఎప్పుడు సినిమా ఉంటుంది అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ కాంబినేషన్ గురించి ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

Allu Arjun : అల్లు అర్జున్ సినిమాలు షారుఖ్ ఖాన్‌కి చూపించాను.. అట్లీ కామెంట్స్

బోయపాటి ప్రస్తుతం రామ్ పోతినేనితో ‘స్కంద’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక ఈ చిత్రం తరువాత బోయపాటి.. సూర్యతో సినిమా సెట్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం తమిళ్, తెలుగు మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీని గురించి బోయపాటి, సూర్య టీం నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. మరి ఈ కాంబినేషన్ నిజంగానే సెట్స్ పైకి వెళ్తుందా..? అనేది చూడాలి.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించాలని ఉంది.. కన్నడ స్టార్ హీరో కామెంట్స్..

సూర్య ప్రస్తుతం ‘కంగువ’ (Kanguva) సినిమాలో నటిస్తున్నాడు. శివ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతుంది. సూర్య వారియర్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ కలిసి ఈ చిత్రాన్ని 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సూర్య ఈ సినిమాలో డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం పది భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.