Deepika Rangaraju : కార్తీక దీపం సీరియల్ ఛాన్స్ నాకే వచ్చింది.. కానీ.. రెండేళ్లు ఖాళీగా.. బ్రహ్మముడి సీరియల్ దీపిక కామెంట్స్..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీపిక ఆసక్తికర విషయం తెలిపింది.

Deepika Rangaraju : కార్తీక దీపం సీరియల్ ఛాన్స్ నాకే వచ్చింది.. కానీ.. రెండేళ్లు ఖాళీగా.. బ్రహ్మముడి సీరియల్ దీపిక కామెంట్స్..

Deepika Rangaraju

Updated On : July 13, 2025 / 3:05 PM IST

Deepika Rangaraju : బ్రహ్మముడి సీరియల్ తో తెలుగులో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది చెన్నై భామ దీపిక రంగరాజు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ తో పాటు పలు టీవీ షోలతో బిజీగానే ఉంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీపిక ఆసక్తికర విషయం తెలిపింది.

దీపికా రంగరాజు మాట్లాడుతూ.. కార్తీక దీపం ఛాన్స్ మొదట నాకే వచ్చింది. కానీ నాకు అప్పటికి అంత ఏజ్, అంత మెచ్యూరిటీ లేదు. నాకు అవకాశం వచ్చినప్పుడు అది కార్తీక దీపం సీరియల్ అని తెలీదు. బ్లాక్ మేకప్ వేసుకొని నటించాలి అన్నారు. ఒక మలయాళం సీరియల్ రీమేక్ అని చెప్పారు. ఇదంతా ఫోన్ లోనే జరిగింది. ఆడిషన్ కి రమ్మన్నారు. కానీ పేరెంట్స్ ఒక్కదాన్నే హైదరాబాద్ కి వద్దన్నారు. దేవుడి దగ్గర చిట్టీలు వేసాను హైదరాబాద్ కి వెళ్లాలా వద్దా అని వద్దు అని వచ్చింది. దాంతో వెళ్ళలేదు. సీరియల్ కి నో చెప్పాను అని తెలిపింది.

Also Read : Shankar : గేమ్ ఛేంజర్ ఫ్లాప్ తర్వాత శంకర్ వెయ్యి కోట్ల సినిమా.. నిర్మాతలు దొరికేసారు.. యోధుడి కథతో హిట్ కొడతాడా?

అలాగే తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. కాలేజీ అయ్యాక న్యూస్ రీడర్ గా మూడు నెలలు చేశాను. తర్వాత ఒక సీరియల్ ఛాన్స్ వస్తే చేశాను. ఇంట్లో నేను ఈ ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేదు. సీరియల్ చేస్తున్నప్పుడు సినిమా ఛాన్స్ వచ్చింది. అందరూ నువ్వు హీరోయిన్ లా ఉంటావు సినిమాకు వెళ్లామన్నారు. కానీ అది స్టార్ట్ అవ్వలేదు. రెండేళ్లు ఏం చేయకుండా సినిమా, సీరియల్స్ ఛాన్సులు ట్రై చేశా. నేను ట్రై చేసిన సినిమాలు అన్ని వరస్ట్ అని తెలిసింది. ఆడిషన్ అవుతుంది కానీ సినిమా మొదలవ్వదు. తెలుగులో ఒక సీరియల్ లో కొన్ని వారాల పాటు వేరే హీరోయిన్ కి రీప్లేస్మెంట్ కావాలి అన్నారు. అప్పుడే బ్రహ్మముడి సీరియల్ వచ్చింది. దాంతో బహ్మముడి సెలెక్ట్ చేసుకున్నాను అని తెలిపింది.

Also Read : Kota Srinivasa Rao : అన్నయ్యతో మొదటి సినిమా.. తమ్ముడితో చివరి సినిమా.. కోట శ్రీనివాసరావు చివరి సినిమా త్వరలో..