Brahmastra: బ్రహ్మాస్త్ర బంపర్ ఆఫర్.. కేవలం నాలుగే రోజులట!

బాలీవుడ్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ఇటీవల రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ ఫిక్షన్ మూవీలో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించగా, అందాల భామ ఆలియా భట్ హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రలు జరుపుకుంటున్న ప్రేక్షకులకు బ్రహ్మాస్త్ర టీమ్ ఈ సినిమా టికెట్ రేట్లను నాలుగు రోజుల పాటు కేవలం రూ.100 కే అందించాలని నిర్ణయించింది.

Brahmastra: బ్రహ్మాస్త్ర బంపర్ ఆఫర్.. కేవలం నాలుగే రోజులట!

Brahmastra Special Ticket Price For These Four Days

Brahmastra: బాలీవుడ్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ఇటీవల రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ ఫిక్షన్ మూవీలో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించగా, అందాల భామ ఆలియా భట్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా, ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా రిలీజ్ చేసింది బ్రహ్మాస్త్ర చిత్ర యూనిట్.

Brahmastra: బ్రహ్మాస్త్రలో కార్తికేయ-2 పోలికలు.. ఇవన్నీ సేమ్ టు సేమ్!

ఈ సినిమాకు అనుకున్నట్లుగానే మంచి టాక్ రావడంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాకు నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఇటీవల ‘నేషనల్ సినిమా డే’ సందర్భంగా సెప్టెంబర్ 23న ఈ సినిమా టికెట్ రేట్లను తగ్గింపు ధరలో అందుబాటులో ఉంచడంతో, ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో ఆసక్తిని కనబరిచారు. కేవలం ఆ ఒక్క రోజే 80 శాతం ఆక్యుపెన్సీ థియేటర్లలో కనిపించిందని.. ఈ సినిమా చూసేందుకు ఆడియెన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపెట్టారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు బ్రహ్మాస్త్ర టీమ్ మరోసారి అలాంటి బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

Brahmastra: ‘బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర’ నుంచి ‘రికార్డుల బ్రహ్మాస్త్ర’కు.. విషయమేంటి?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రలు జరుపుకుంటున్న ప్రేక్షకులకు బ్రహ్మాస్త్ర టీమ్ ఈ సినిమా టికెట్ రేట్లను నాలుగు రోజుల పాటు కేవలం రూ.100 కే అందించాలని నిర్ణయించింది. ఈ ఆఫర్ కేవలం సెప్టెంబర్ 26 నుంచి సెప్టెంబర్ 29 వరకు మాత్రమే బ్రహ్మాస్త్ర టీమ్ అందించనుంది. దీంతో ఈ సమయంలో ప్రేక్షకులు మళ్లీ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని కనబరుస్తారని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి బ్రహ్మాస్త్ర టీమ్ ఇస్తోన్న ఆ బంపర్ ఆఫర్ సినిమాకు ఎంతవరకు హెల్ప్ చేస్తుందో చూడాలి.