శివ ప్రసాద్ మృతికి సంతాపం తెలిపిన ప్రముఖులు
ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ శివ ప్రసాద్ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు..

ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ శివ ప్రసాద్ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు..
ప్రముఖ సినీ నటుడు, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నారమల్లి శివ ప్రసాద్ కిడ్నీ సమస్యతో బాధపడుతూ.. సెప్టెంబర్ 21న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. శివ ప్రసాద్ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ఏపీ సీఎం జగన్, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, పరిటాల శ్రీరామ్, ప్రముఖ రచయిత పరుచూరి మురళీకృష్ణ, పిఆర్వో బి.ఎ.రాజు తదితరులు శివ ప్రసాద్ మృతికి సంతాపం తెలిపారు. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శివ ప్రసాద్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
Read Also : శివ ప్రసాద్ సినీ ప్రయాణం..
‘వారం రోజుల్లో పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులను కోల్పోవడం చాలా బాధాకరమని, శివ ప్రసాద్ తనకు చిరకాల మిత్రుడని, ప్రత్యేక హోదా విభజన చట్టంలో హామీల అమలుకోసం అలుపెరగని పోరాటం చేశారని, ఆయన మరణం చిత్తూరు జిల్లాకే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి, తమ పార్టీకి తీరని లోటు అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని’ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.