Che Long Live Review : చేగువేరా బ‌యోపిక్ ‘చే’ మూవీ రివ్యూ.. తెలుగులో మొదటి చేగువేరా బయోపిక్ సినిమా..

చెగువేరాపై ప్రపంచంలోని పలు దేశాల్లో సినిమాలు వచ్చినా తెలుగులో ఇదే మొదటి సినిమా. చేగువేరా జీవితం ఎక్కడో క్యూబా, అర్జెంటీనా, బొలివియా దేశాల్లో జరిగినా ఈ సినిమా అంతా మన నేటివిటీకి దగ్గరగా ఉంటుంది.

Che Long Live Review : చేగువేరా బ‌యోపిక్ ‘చే’ మూవీ రివ్యూ.. తెలుగులో మొదటి చేగువేరా బయోపిక్ సినిమా..

Che Guevara Telugu Biopic Che Long Live Movie Review and Rating

Updated On : December 15, 2023 / 6:54 PM IST

Che Long Live Review : క్యూబా విప్లవ యోధుడిగా చేగువేరా(Che Guevara) అందరికి పరిచయమే. చేగువేరాని ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకున్నారు. చేగువేరాపై ప్రపంచవ్యాప్తంగా పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇప్పుడు చేగువేరా జీవితకథపై తెలుగులో సినిమా వచ్చింది. బి.ఆర్ సభావత్ నాయక్ మెయిన్ లీడ్ లో ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన సినిమా ‘చే’- లాంగ్ లైవ్. లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్.. పలువురు ముఖ్య పాత్రల్లో చేగువేరా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘చే’ సినిమా నేడు డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

కథ విషయానికొస్తే.. జనాల్లో చైతన్య తేవాలని విప్లవం బాట పట్టిన ‘చే'(సభావాత్ నాయక్) పలు ప్రాంతాలు తిరుగుతూ ఉంటాడు. ఒక సమయంలో పోలీసుల ఎదురు కాల్పుల్లో గాయపడగా అక్కడ దగ్గర్లో ఉన్న గిరిజన గ్రామస్థులు ‘చే’ని కాపాడతారు. అక్కడ సింగి(లావణ్య) అనే అమ్మాయి ‘చే’కి దగ్గరవుతుంది. ‘చే’ అక్కడి ప్రజలు కష్టాలు కూడా చూసి చలించిపోయి వారిలో చైతన్యం నింపడానికి ప్రయత్నిస్తాడు. తన సైన్యాన్ని తయారుచేసుకొని భూస్వాములు, దళారుల దోపిడీలకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై పోరాడుతాడు. ఈ నేపథ్యంలో పోలీసుల చేతిలో తన సైన్యంలోని పలువురు చనిపోయి, ‘చే’ కూడా బొలివియా సైనిక దళాలకు చిక్కుతాడు. ఆ తర్వాత ఏమైంది? ‘చే’ ప్రేమకథ ఏమైంది? ‘చే’ విప్లవం ప్రజల్లో ఉందా? అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. చెగువేరాపై ప్రపంచంలోని పలు దేశాల్లో సినిమాలు వచ్చినా తెలుగులో ఇదే మొదటి సినిమా. చేగువేరా జీవితం ఎక్కడో క్యూబా, అర్జెంటీనా, బొలివియా దేశాల్లో జరిగినా ఈ సినిమా అంతా మన నేటివిటీకి దగ్గరగా ఉంటుంది. చేగువేరా జీవితం కథనే తీసుకొని దానికి కొంచెం కమర్షియల్ ఎలివేషన్స్ అద్ది సినిమాని తీర్చిదిద్దారు. చేగువేరా పాత్రకు మంచి ఎలివేషన్స్ ఇచ్చారు.

నటీనటులు, టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. సినిమాలో మెయిన్ లీడ్ గా చేగువేరా పాత్రలో బి.ఆర్ సభావత్ నాయక్ నటించాడు. ఆయనే ఈ సినిమాకు రచయితగా, దర్శకుడిగా పనిచేయడం విశేషం. ఓ పక్క నటుడిగా మెప్పిస్తునే దర్శకుడిగా కూడా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. చేకు జంటగా లావణ్య కూడా బాగా నటించింది. మిగిలిన పాత్రలు కూడా పర్వాలేదనిపించాయి. ఇక ఈ సినిమాలో సంగీత దర్శకుడు రవి శంకర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అవుతుంది. కెమెరా విజువల్స్ కూడా బాగున్నాయి.

Also Read : జోరుగా హుషారుగా మూవీ రివ్యూ.. ‘బేబీ’ సినిమా విరాజ్ అశ్విన్ హీరోగా మెప్పించాడా?

మొత్తంగా ‘చే’- లాంగ్ లైవ్ సినిమా చేగువేరా జీవిత కథ ఆధారంగా ఇండియన్ నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. విప్లవం సినిమాలు, చేగువేరా అభిమానులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.