Bhola Shankar: ‘భోళాశంకర్’పై మెగా అప్డేట్.. వచ్చేది అప్పుడేనట!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ రేపు ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీతో చిరంజీవి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి తనదైన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.

Bhola Shankar: ‘భోళాశంకర్’పై మెగా అప్డేట్.. వచ్చేది అప్పుడేనట!

Chiranjeevi Gives Interesting Update On Bhola Shankar Movie

Updated On : January 12, 2023 / 3:37 PM IST

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ రేపు ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీతో చిరంజీవి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి తనదైన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.

Bhola Shankar: భోళాశంకర్ సినిమాలో చిరుతో చిందేయనున్న రష్మీ..

ఈ సినిమాలో ఊరమాస్ అవతారంలో మెగాస్టార్ కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ నెక్ట్స్ లెవెల్‌లో నిర్వహిస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగాస్టార్, తన నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడని.. భోళాశంకర్ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

Bhola Shankar : సమ్మర్ కి రెడీ అవుతున్న భోళా శంకర్.. మెగాస్టార్ బర్త్ డేకి ఒకరోజు ముందే రిలీజ్ డేట్ అనౌన్స్..

అయితే ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్‌ను జనవరి 17న ప్రారంభిస్తామని.. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని.. అలాగే ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని తాము భావిస్తున్నట్లు మెగాస్టార్ తెలిపారు. ఒకవేళ ఈ సినిమా వేసవికి రెడీ కాలేదంటే, దసరా కానుకగా ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని మెగాస్టార్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి సోదరి పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.