పవన్ అందుకే ఓడాడు.. రాజకీయాలు చేయొద్దని కమల్, రజనీకి చిరు సూచన

పవన్ అందుకే ఓడాడు.. రాజకీయాలు చేయొద్దని కమల్, రజనీకి చిరు సూచన

Updated On : September 26, 2019 / 4:01 PM IST

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సైరా సినిమా పబ్లిసిటీ పనిలో ఉండగానే తన సన్నిహితులకు సూచనలు ఇస్తున్నారు. అక్టోబరు 2న రిలీజ్ అయ్యేందుకు ముస్తాబైన సైరా సినిమా సెన్సార్ బోర్డు దగ్గర ఉండగా పబ్లిసిటీ పనులు హడావిడిగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల తమిళ మ్యాగజైన్ ఆనంద వికటన్‌కు మెగాస్టార్ చిరు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ఆ మ్యాగజైన్ తరపు వచ్చిన వ్యక్తి రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం గురించి చిరంజీవిని అడిగారు. దానికి ఊహించని సమాధానం ఇచ్చిన చిరుని చూసి షాక్ అయ్యారు. పాలిటిక్స్‌లోకి ఈ మధ్యనే రంగ ప్రవేశం చేసిన కమల్ హాసన్, రజనీకాంత్‌లు పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావొద్దని. ఇక్కడ విలువ ఉండదని చెప్పారు. అంతేకాకుండా రాజకీయాలంటే వట్టి డబ్బేనని నొక్కి చెప్పారు. 

మంచి చేద్దామని వచ్చినా.. చేసే అవకాశం ఉండదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నెం.1 స్టార్‌గా ఉన్నాను. అంతా వదిలేసి రాజకీయాల్లోకి జాయిన్ అయ్యా. నా సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయా. నా ప్రత్యర్థులు నన్ను ఓడించడానికి కోట్లలో డబ్బులు ఖర్చు పెట్టారు. పవన్ కళ్యాణ్ విషయంలోనూ అదే జరిగింది’ అని చెప్పారు. 

ఈ సారి కమల్ హాసన్ గెలుస్తారని చిరు విశ్వాసం ‘ఈ సారి కమల్ హాసన్ పార్టీ గెలుస్తుందని అనుకున్నా. కానీ, అది జరగలేదు. సెన్సిటివ్ మైండ్‌తో ఉండే మనుషులకు రాజకీయాలంటే టీ తాగినంత సులువు కాదు. రజనీకాంత్, కమల్ హాసన్‌లు నా లాంటి వాళ్లు కాదనుకుంటున్నా. కానీ, నా సలహా ఏంటంటే వారిద్దరూ రాజకీయాల్లోకి రాకపోవడమే బెటర్’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. 

కానీ, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో ఓటములను, విజయాలను సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఒకరోజున పరిస్థితులు మీకు అనుకూలంగా మారొచ్చని ముగించారు చిరు. కమల్ హాసన్ తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటులో కూడా గెలవని విషయం తెలిసిందే. ప్రతిపక్ష డీఎంకే క్లీన్ స్వీప్ చేసింది. రజనీకాంత్ ఇంకా రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టలేదు.