Bengaluru : ఆ స్టాండప్ కమెడియన్ షో క్యాన్సిల్ అయినందుకు సారీ చెప్పాడు.. కారణం ఏంటంటే?

ఇండియాలో ఇటీవల కొన్ని షోలు అనూహ్యంగా క్యాన్సిల్ అవుతున్నాయి. తలపతి విజయ్ 'లియో' ఆడియో లాంచ్ క్యాన్సిల్ అయ్యింది. బెంగళూరులో వరుసగా జరగాల్సిన ట్రెవర్ నోహ్ షోలు రద్దయ్యాయి. అందుకు కారణం ఏంటి?

Bengaluru : ఆ స్టాండప్ కమెడియన్ షో క్యాన్సిల్ అయినందుకు సారీ చెప్పాడు.. కారణం ఏంటంటే?

Bengaluru

Updated On : September 28, 2023 / 12:29 PM IST

Bengaluru : బెంగళూరులో జరగాల్సిన కమెడియన్ ట్రెవర్ నోహ్ షో క్యాన్సిల్ అయ్యింది. అభిమానులకు నిరాశ కలిగించినందుకు నోహ్ అభిమానులకు సారీ చెప్పారు.

Leo Audio Function Cancellled : ‘లియో’ ఆడియో లాంచ్ క్యాన్సిల్.. రాజకీయ ఒత్తిడే కారణమా?

సౌత్ ఆఫ్రికాకు చెందిన ట్రెవర్ నోహ్ తన లైవ్ స్టాండ్ అప్ కామెడీ షోల కోసం ఇండియాలో ఉన్నారు. సెప్టెంబర్ 22, 23, 24 తేదీల్లో ఢిల్లీ ఎన్‌సి‌ఆర్‌‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రదర్శన ఇచ్చారు. సెప్టెంబర్ 27, 28 తేదీల్లో బెంగళూరులో జరగాల్సిన షోలు మాత్రం రద్దయ్యాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ అప్ సెట్ అయ్యారు. దీనిపై ట్రెవర్ నోహ్ ట్విట్టర్‌లో స్పందించారు.

నోహ్ ఇండియా పర్యటనలో భాగంగా బుధ, గురువారాల్లో బెంగళూరులోని మాన్ఫో కన్వెన్షన్ సెంటర్‌లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. కానీ అవి రద్దయ్యాయి. ఈ సందర్భంలో నోహ్ అభిమానులకు సారీ చెప్పారు. ‘ప్రియమైన బెంగళూర్ ఇండియా.. నేను అద్భుతమైన ప్రదర్శన ఇవ్వాలనుకున్నాను.. కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల రెండు షోలు రద్దయ్యాయి. షో చేయడానికి మార్గం కనిపించలేదు. టికెట్ హోల్డర్స్ అందరికీ డబ్బులు తిరిగి అందేలా చూస్తున్నాము. మునుపెన్నడూ జరగని అసౌకర్యానికి చింతిస్తున్నాము’ అంటూ నోహ్ తన ట్విట్టర్ ఖాతాలో (@Trevornoah) పోస్టు పెట్టారు.

Manchu Manoj : మనోజ్ అయిపోయాడు అన్నారు.. భరించాను.. తిరిగొస్తున్నా.. మంచు మనోజ్ కొత్త షో ప్రోమో చూశారా?

ట్రెవర్ షో రద్దుపై బుక్ మై షో కూడా ప్రకటన చేసింది. రెండు షోల కోసం టికెట్ కొనుగోలు చేసిన కస్టమర్లకు 8 నుంచి 10 పనిదినాల్లోపు పూర్తి రీఫండ్ చెల్లిస్తామని వెల్లడించింది. ట్రెవర్ షోను వీలైనంత త్వరగా తిరిగి తీసుకువస్తామని చెప్పింది. ట్రెవర్ నోహ్ ఇండియాలో ప్రదర్శనల అనంతరం దుబాయ్ వెళ్తారని తెలుస్తోంది. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 వ తేదీల్లో ముంబయి NSCI డోమ్ లో ఆయన భారత్‌లో చివరి ప్రదర్శన ఇవ్వనున్నారు.