వినయ విధేయ రామ ట్రైలర్ : బై బర్తే డెత్‌ని గెలిచొచ్చా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న సినిమా,  వినయ విధేయ రామ..

  • Published By: sreehari ,Published On : December 28, 2018 / 06:40 AM IST
వినయ విధేయ రామ ట్రైలర్ : బై బర్తే డెత్‌ని గెలిచొచ్చా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న సినిమా,  వినయ విధేయ రామ..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న సినిమా,  వినయ విధేయ రామ.. శ్రీమతి డి.పార్వతి సమర్పణలో, డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. నిన్న జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, మెగాస్టార్ చిరంజీవి, టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ కలిసి ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్ చేసారు. ట్రైలర్ ఓపెనింగే యాక్షన్‌తో స్టార్ట్ చేసి, తర్వాత కొన్ని ఫ్యామిలీ షాట్స్ చూపించి, తిరిగి మాస్ మసాలా మోడ్‌లోకి తీసుకెళ్ళిపోయాడు బోయపాటి.

సరైన సింహం తగలనంత వరకు ప్రతీ వేటగాడూ మగాడేరా, నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు.. బై బర్తే డెత్‌ని గెలిచొచ్చా.. అంటూ, పవర్‌ఫుల్ డైలాగ్ చెప్తూ, చరణ్ రౌడీలను చితక్కొట్టడం అనేది బోయపాటి రెగ్యులర్ ఫార్మాటే. హీరోకి ధీటుగా విలన్ వివేక్ ఒబెరాయ్ క్యారెక్టర్ ఉండబోతుందనేది ట్రైలర్‌లో అతణ్ణి చూపించిన విధానం బట్టి అర్థం అవుతుంది. ఈ ప్రాంతంలో ఓటైనా, మాటైనా, తూటా అయినా నాది.. అనే డైలాగ్‌తో వివేక్ క్యారెక్టర్ తనని తాను పరిచయం చేసుకుంటుంది.

హీరో అన్నయ్య ప్రశాంత్, ది బ్యాలెట్ ఈజ్ పవర్ ఫుల్ దెన్ ది బుల్లెట్, లెట్స్ ప్రూవ్ ఇట్, క్రష్ దెమ్ డౌన్ అనే డైలాగ్ చెప్పడం చూస్తే, ఈ మూవీలో విలన్ సైడ్ నుండి పొలిటికల్ యాంగిల్ కూడా ఉంటుందని పిస్తుంది. చివరగా అజర్ బైజాన్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌కి సంబంధించిన షాట్స్‌తో ఆడియన్స్‌కి షాకిచ్చాడు బోయపాటి. చూట్టూ భారీ పర్సనాలిటీతో ఉన్న విదేశీ రౌడీలు, వాళ్ళ మధ్యలో బంధీగా ఉన్న చరణ్, ఒక్కనాకొడుక్కీ టైమింగ్ లేదు, టైమింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ ఉంటే  టైమింగ్ లేదు, సరిగ్గా పుట్టినోడు, సరైన మగాడు ఒక్కడు కూడా తగల్లేదు, అంతా జంక్.. అంటూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు.

బాడీపై టాటూలతో కొత్తగా కనిపించిన చెర్రీ, ట్రైలర్ చివర్లో గుర్రపు స్వారీ చేస్తూ కనిపించాడు. మొత్తానికి బోయపాటి తన మాస్ మసాలా మార్క్‌కి తగ్గట్టుగా చరణ్‌ని మార్చడం, చరణ్ కూడా తనలోని మాస్ యాంగిల్‌ని పూర్తిగా బయటకి తియ్యడంతో వినయ విధేయ రామ ట్రైలర్, మెగాభిమానుల్నీ, మాస్ ఆడియన్స్‌నీ విపరీతంగా ఆకట్టుకుంటుంది.

వాచ్ వినయ విధేయ రామ ట్రైలర్…