NC 24: నాగ చైతన్య నుంచి క్రేజీ వీడియో.. ఇది మాములు సెటప్ కాదు..

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ఒక పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న (NC 24)విషయం తెలిసిందే. విరూపాక్షతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

NC 24: నాగ చైతన్య నుంచి క్రేజీ వీడియో.. ఇది మాములు సెటప్ కాదు..

Crazy video released from Naga Chaitanya's NC 24 movie

Updated On : November 20, 2025 / 5:31 PM IST

NC 24: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ఒక పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విరూపాక్షతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.(NC 24)ఇంకా పేరు పెట్టని ఈ సినిమా నుంచి తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో సినిమాలోని కీలక రాజ మహల్ సెటప్ కి సంబందించిన విజువల్స్ ను చూపించారు. అలాగే హీరో నాగ చైతన్యకి సంబందించిన యాక్షన్ సీన్స్ కి సంబందించిన ప్రాక్టీస్ విజువల్స్ కూడా చూపించారు. ఒక రేంజ్ లో ఉన్న ఈ విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. అలాగే, NC 24 టైటిల్, టీజర్ కూడా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.

Bheems: అయ్యో.. నేనలా అనలేదు.. తప్పుగా అర్థం చేసుకున్నారు.. వైరల్ అవుతున్న భీమ్స్ కామెంట్స్