వర్మ మరో సినిమా.. హాట్‌గా ఫస్ట్ లుక్!

  • Published By: vamsi ,Published On : August 10, 2020 / 08:48 AM IST
వర్మ మరో సినిమా.. హాట్‌గా ఫస్ట్ లుక్!

Updated On : August 10, 2020 / 9:32 AM IST

రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. వివాదాలకు దగ్గరగా ఉంటూ నిత్యం ఏదో ఒక సినిమా ప్రకటిస్తూ.. ఏదో ఒక సినిమాని విడుదల చేస్తూ.. లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి సమయంలోనూ తనదైన శైలిలో సినిమాలతో దూసుకెళ్తున్నాడు వర్మ.



కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించాక RGV World పేరుతో ఓ ఫ్లాట్‌ఫామ్ స్టార్ట్ చేసిన వర్మ.. క్లైమాక్స్, నగ్నం, థ్రిల్లర్ అంటూ వరుసగా సినిమాలు తెరకెక్కించారు. ఇటీవల కాంట్రవర్శియల్ సబ్జెక్ట్‌తో పవన్ స్టార్ అనే సినిమాను విడుదల చేశాడు. మర్డర్ అంటూ రియల్ స్టోరీ ఆధారంగా మరో సినిమా తీస్తున్న వర్మ.. ఇదే సమయంలో మరో వివాదాస్పద అంశాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు.

లెస్బియన్స్ కథాంశంతో ‘డేంజరస్’ (RGV’s Movie DANGEROUS) అనే మూవీని తెరకెక్కిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. లెస్బియన్లు తమ ప్రేమ కోసం చావడానికైనా, ఎవరినైనా చంపడానికైనా సిద్ధంగా ఉంటారంటూ ట్యాగ్ లైన్ ఇచ్చాడు. డేంజరస్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన వర్మ.. వరుస ట్వీట్లతో తన హీరోయిన్లు, స్టోరీని ఎలివేట్ చేశాడు.



ఇద్దరు హాట్ బ్యూటీలు అప్సరా రాణి (Apsara Rani), నైనా గంగూలీ (Naina Ganguly)లు ఇందులో కీలకపాత్రల్లో కనిపించనున్నారు. వీరిద్దరు ఒకరికోసం ఒకరు తపించిపోయే లెస్బియన్లుగా హాట్ హాట్‌గా కనిపించబోతున్నారు. భారత్‌లో తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ మూవీ ‘డేంజరస్’ అని దర్శకుడు వర్మ చెప్పుకొచ్చాడు.