Dhurandhar OTT: గుడ్ న్యూస్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్ దురంధర్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ దురంధర్ మూవీ ఓటీటీ(Dhurandhar OTT)లో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.

Dhurandhar OTT: గుడ్ న్యూస్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్ దురంధర్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

Dhurandhar movie streaming on Netflix from January 30th.

Updated On : January 22, 2026 / 7:25 AM IST
  • ఓటీటీలోకి వస్తున్న దురంధర్
  • నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
  • మార్చిలో విడుదల కానున్న దురంధర్ సీక్వెల్

Dhurandhar OTT: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ దురంధర్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేసింది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇండియన్ ఆర్మీ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించగా.. సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది. అక్షయ్ ఖన్నా స్పెషల్ రోల్ చేశాడు. అయితే, ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయలేదు మేకర్స్.

Maruthi: రాజాసాబ్ ప్లాప్.. మెగా హీరోతో మూవీ సెట్.. మారుతీ సూపర్ ప్లాన్

దాంతో, ఈ సినిమాను చూసేందుకు మిగతా బాషల ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈనేపధ్యలోనే వారి కోసం గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. దురంధర్ మూవీ ఓటీటీ(Dhurandhar OTT)లో విడుదల కానుందట. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. జనవరి 30 నుంచి దురంధర్ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారట. ఈ న్యూస్ తెలియడంతో దురంధర్ సినిమా కోసం చూస్తున్న ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేయిస్తున్నారు.

ఇక ఓటీటీలో ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. చూడని వాళ్ళు, చూసినవాళ్లు కూడా ఈ సినిమాను ,మళ్ళీ మళ్ళీ చూసే అవకాశం ఉంది. కాబట్టి, దురంధర్ సినిమా ఓటీటీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం. ఇక దురంధర్ సినిమాకు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మార్చి 19న విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.