అనుష్క బేబి బంప్ పోస్ట్‌పై కామెంట్.. మారుతి ఫైర్..

Anushka Sharma-Director Maruthi Reacted on Netizen Comment: అనుష్క శర్మ, కోహ్లీ దంపతులు ఇటీవల త్వరలో మాకు పండంటి బిడ్డ జన్మించబోతున్నాడని తెలిపారు.. మొన్న అనుష్క కూడా తన జీవితంలో జరుగుతున్న ప్రతి మార్పును ఎంతగానో ఆస్వాదిస్తున్నానని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. బేబి బంప్ ఫొటో షేర్ చేశారు.. ఈ ట్వీట్‌పై ఓ మహిళా జర్నలిస్ట్ కాస్త వ్యంగ్యంగా చేసిన కామెంట్ టాలీవుడ్ డైరెక్టర్ మారుతికి ఆగ్రహం తెప్పించింది. దాంతో తనదైన శైలిలో ఆమెకు కౌంటర్ ఇచ్చారు.
‘అనుష్క అతను నిన్ను తల్లిని మాత్రమే చేశాడు. ఇంగ్లండ్‌కు మహారాణిని చేయలేదు. మరీ, అంత సంబరపడకు’ అంటూ #InsecureTrending అనే హ్యాష్ ట్యాగ్ జతచేస్తూ కామెంట్ చేశారు. ఈ కామెంట్‌పై మారుతి స్పందిస్తూ..
‘‘ఓ మహిళా జర్నలిస్ట్ అయిన మీరు ఇలాంటి కామెంట్ చేయడం విచారకరం. ఇంగ్లండ్‌కు మహారాణి కావడం కంటే ఓ బిడ్డకు తల్లి కావడం.. ఓ మహిళకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అవును.. ప్రతి మహిళా ఒక మహారాణే.. సంతోషంతో నిండిన ప్రతి ఇల్లూ ఓ గొప్ప సామ్రాజ్యమే.. ఆమె సెలబ్రిటీ కావడం కంటే ముందు ఓ సాధారణ మహిళ. తల్లి కాబోతున్న క్షణాలను ఆస్వాదించే హక్కు ఆమెకుంద’’ని సదరు మహిళా జర్నలిస్ట్‌కు తనదైన స్టైల్లో మారు మాట్లాడే అవకాశమివ్వకుండా రిప్లై ఇచ్చారు దర్శకుడు మారుతి.
Disgraceful comments
That too frm a lady journalist 🙁Motherhood is bigger joy than being queen of England
Yes every woman is a queen & every happy home is a kingdomShe’s a normal human being too before being a celebrity & she has full right to be happy & flaunt her baby bump https://t.co/QnwX8Uzfy5
— Director Maruthi (@DirectorMaruthi) September 14, 2020