Sekhar Kammula : హైదరాబాద్ అంటే బిర్యానీ కాదు.. హైదరాబాద్, సినిమాల గురించి శేఖర్ కమ్ముల ఎంత గొప్పగా చెప్పాడో తెలుసా??

మూడు రోజులపాటు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి శేఖర్ కమ్ముల ప్రసంగించారు.

Sekhar Kammula : హైదరాబాద్ అంటే బిర్యానీ కాదు.. హైదరాబాద్, సినిమాల గురించి శేఖర్ కమ్ముల ఎంత గొప్పగా చెప్పాడో తెలుసా??

Director Sekhar Kammula Speech at National Educational Film Festival OU Campus

Updated On : April 28, 2023 / 11:51 AM IST

Sekhar Kammula :  ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల సందడి చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యునికేషన్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న 24వ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను శేఖర్ కమ్ముల ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శేఖర్ కమ్ముల రాకతో ఉస్మానియాలోని ఠాగూర్ ఆడిటోరియం విద్యార్థుల కేరింతలో మారుమోగిపోయింది. మూడు రోజులపాటు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి శేఖర్ కమ్ముల ప్రసంగించారు.

శేఖర్ కమ్ముల ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ అంటే బిర్యానీ, ఇరానీ చాయ్ కే కాదు… గొప్ప ప్రేమకు కూడా నిలయం. ఈ విషయం నా సినిమాల ద్వారా చెప్పాను. కానీ ఇక్కడ చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులున్నారు కాబట్టి మరోసారి చెబుతున్నా. హైదరాబాద్ ను చూస్తే ఎవరైనా ప్రేమలో పడాల్సిందే. కుల్ కుతుబ్ షా-భాగమతిల ప్రేమ చాలా అందంగా ఉండేది. మూసీ నది ఒడ్డున వారి ప్రేమ గొప్పగా సాగింది. వారి ప్రేమకు నిదర్శనంగా అప్పట్లో ప్యారనాఫూల్ బ్రిడ్జ్ కట్టారు. ఇప్పుడు మనం దాన్ని పురానాపూల్ బ్రిడ్జి అంటున్నాం. అలాగే వినిస్ట్రన్ చర్చిల్-ఫ్యాములా హైదరాబాద్ వీధుల్లో ఏనుగుపై తిరిగేవారట. కోఠి ఉమెన్స్ కళాశాల చుట్టూ ఓ గొప్ప ప్రేమ కథ ఉంది. ఇలా హైదరాబాద్ లో ఎక్కడ చూసిన ప్రేమ కనిపిస్తుంది. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా దేశంలో ఎక్కడా లేని చరిత్ర ఉంది. పీవీ నర్సింహారావు, నాగేశ్ శర్మ, శ్యామ్ బెనగల్, అజారుద్దీన్ ఇలా అనేక రంగాల్లో గొప్పవాళ్లు ఇక్కడి నుంచి వెళ్లినవాళ్లు అని అన్నారు.

Director Shekhar Kammula Speech at National Educational Film Festival OU Campus

Rajinikanth : ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం విజయవాడలో సూపర్ స్టార్.. బాలయ్యతో కలిసి రజినీ సందడి..

ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.. సినిమాలతో కూడా ఇక్కడ ప్రేమలో పడొచ్చు. సమాజానికి ఉపయోగపడే మంచి సినిమాలు వచ్చాయి. మన ప్రాంతం, మన దేశం అని కాకుండా ప్రపంచమంతా చూసే సినిమాలు వస్తున్నాయి. ఈరోజు మనం లేకున్నా రేపు మన సినిమాలు బతికే ఉంటాయి. సొసైటీలో చెడు ఉందని, అదే తీస్తున్నామంటారు కొంత మంది. సినిమాలు ఇట్లనే ఉంటాయంటారు. కానీ అది కరెక్ట్ కాదు. నువ్ సినిమా తీయాలి. కానీ చెడును సవరించేలా ఉండాలి. మంచిని ప్రొత్సహించేలా ఉండాలి. సినిమా ద్వారా మంచి మార్పును తీసుకొచ్చేలా ఉండాలి. ఇదే విషయాన్ని నేను నా సినిమాల ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తుంటాను. సినిమా అనేది యూనివర్శల్ గా ఉండాలి. న్యూయార్క్ లో భాష తెలియని వాడు కూడా చూస్తే అతనికి మన సినిమా aఅర్థం కావాలి. సినిమాకు యూనివర్శల్ అప్పీల్ ఉండాలి. ఇవాళ తీసిన సినిమా మరో పదేళ్లైనా చూసేలా ఉండాలి. పాతపడకూడదు. ఆది చూశాక గర్వపడేలా ఉండాలి. పిల్లలతో కలిసి చూసేలా ఉండాలి. అందుకే కిందిస్థాయి నుంచి ఆలోచించడం మొదలుపెట్టాలి. డాక్యుమెంటరీ, ఫిల్మ్ ఏది తీసినా, ఎక్కడ పోస్టు చేసినా దిగువ స్థాయిని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే చాలా మంది నా సినిమాలను ఇష్టపడతారు. విద్యార్థులు మీరు ఏం కల కంటున్నారో వాటిని సాధించేందుకు కృషి చేస్తే గొప్పవాళ్లు అయినట్టే అని అన్నారు.