Sujeeth : చాలా మంది ఏదేదో మాట్లాడుతున్నారు.. సుజీత్ పోస్ట్ వైరల్..
దర్శకుడు సుజీత్ (Sujeeth) సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది

Director Sujeeth react on rumours on social media
Sujeeth : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఓజీ. సాహో ఫేమ్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రం గురువారం (అక్టోబర్ 23) నుంచి ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఓజీ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
ఇదిలా ఉంటే.. చిత్ర దర్శకుడు సుజీత్ సోషల్ మీడియాలో ఓ లేఖను పోస్ట్ చేశారు. ఇందులో ఇలా రాసి ఉంది. ‘ఓజీ గురించి చాలా మంది ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అయితే.. చిత్ర ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు ఏమి అవసరం అనేది కొంత మందికి మాత్రమే తెలుస్తుంది. ఈ చిత్రం కోసం నా నిర్మాత, టీమ్ ఇచ్చిన మద్ధతు గురించి మాటల్లో చెప్పలేను. ఈ చిత్రం పట్ల పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అభిమానులు చూపించిన అమితమైన ప్రేమ వర్ణించలేనిది. ఇక నిర్మాత దానయ్య నాకు ఇచ్చిన సపోర్టు, నమ్మకానికి ఆయనకు కృతజ్ఞతలు. ప్రేమ, గౌరవం, కృతజ్ఞతతో సుజీత్.’ అని రాసి ఉంది.
Thamma Review : ‘థామా’ మూవీ రివ్యూ.. రష్మిక మందన్న ఫస్ట్ హారర్ సినిమా ఎలా ఉంది..?
— Sujeeth (@Sujeethsign) October 21, 2025
ప్రస్తుతం సుజీత్ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుజీత్ ఇలా ఎందుకు లేఖ రాశాడు అనే విషయం పై నెట్టింట చర్చ మొదలైంది. అయితే.. ఈ చిత్ర నిర్మాత దానయ్య, దర్శకుడు సుజీత్ కు మధ్య మనస్పర్థలు వచ్చాయని, ఈ క్రమంలోనే సుజీత్ కు రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదనే రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటికి ఫుల్‌స్టాప్ పెట్టాలనే సుజీత్ ఇలా చేశాడని కొందరు అంటున్నారు.