V Samudra : తన కొడుకులను హీరోలుగా పెట్టి సినిమా తీస్తున్న ఒకప్పటి స్టార్ డైరెక్టర్..
తన కొడుకులు అరుణ్ మహాశివ, రామ్ త్రివిక్రమ్ లను పెట్టి డైరెక్టర్ సముద్ర సినిమా తీయబోతున్నారు

Director V Samudra Doing a Movie with his Sons Movie Opening happens on Dasara
V Samudra : సింహరాశి, శివరామరాజు, మహానంది, ఎవడైతే నాకేంటి. పంచాక్షరీ.. లాంటూ పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ సముద్ర గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు తన కొడుకులు అరుణ్ మహాశివ, రామ్ త్రివిక్రమ్ లను పెట్టి డైరెక్టర్ సముద్ర సినిమా తీయబోతున్నారు.
అరుణ్ మహాశివ, రామ్ త్రివిక్రమ్ హీరోలుగా హారిక సమర్పణలో చందు క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ చంద్ర పులుగుజ్జు నిర్మాణంలో సముద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ‘దో కమీనే’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఇందులో తస్మయి, శ్రీ రాధ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నిన్న దసరా సందర్భంగా ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, సుమన్, డైరెక్టర్ బి గోపాల్, AS రవికుమార్.. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సుమన్ క్లాప్ కొట్టగా, బి.గోపాల్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. హీరో శ్రీకాంత్ స్క్రిప్ట్ అందించగా నందమూరి మోహనకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఇక ఈ సినిమాలో సుమన్, కన్నడ కిషోర్, సునీల్, బ్రహ్మానందం, అలీ, అజయ్ ఘోష్, బాహుబలి ప్రభాకర్, ఈశ్వరీ రావ్, ఝాన్సీ.. పలువురు నటిస్తున్నారు.
Also Read : Nara Rohit – Siree Lella : హీరో నారా రోహిత్ – హీరోయిన్ సిరి లేళ్ల నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వి సముద్ర మాట్లాడుతూ.. దో కమీనే సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నాను. నా సినిమా ఓపెనింగ్ కి వచ్చిన నా మిత్రులందరికీ కృతజ్ఞతలు. నా స్నేహితుడు చంద్ర ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. నవంబర్ 3వ వారం నుంచి దో కమీనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం అని తెలిపారు. నిర్మాత చంద్ర పులుగుజ్జు మాట్లాడుతూ.. మా చంద్ర క్రియేషన్స్ బ్యానర్ లో దో కమీనే సినిమాను సముద్ర గారి దర్శకత్వంలో లాంచ్ చేయడం సంతోషంగా ఉంది అని తెలిపారు.
హీరోలుగా నటిస్తున్న సముద్ర తనయులు రామ్ త్రివిక్రమ్, అరుణ్ మహాశివ మాట్లాడుతూ.. నాన్న సముద్ర గారి దర్శకత్వంలో నటించాలనే డ్రీమ్ ఈ సినిమాతో తొందరగా నెరవేరుతుంది. ఈ అవకాశం ఇచ్చిన నాన్న గారితో పాటు నిర్మాత చంద్ర గారికి ధన్యవాదాలు అని తెలిపారు.