Evaru Meelo Koteeswarulu : రామ్ – భీమ్ ఎపిసోడ్ హయ్యెస్ట్ టీఆర్‌పీ..!
ఈ షో ఆగస్టు 22న కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌తో స్టార్ట్ అయ్యింది.. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పాల్గొని సందడి చేశారు.. ఈ ఎపిసోడ్ హైయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ సాధించింది..

Ntr Ram Charan
Evaru Meelo Koteeswarulu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో తో మరోసారి తెలుగు ప్రేక్షకులను, అభిమానులను తనదైన స్టైల్‌లో ఎంటర్‌టైన్ చేస్తున్నారు. తారక్ పర్ఫార్మెన్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. హాట్ సీట్‌లో కూర్చుని పార్టిసిపెంట్స్‌ని కంగారు పెట్టకుండా వారితో కలివిడిగా ఉంటూ సరదాగా గేమ్ ఆడిస్తున్నారు.
RRR Dosti : ‘పులికి, విలుకాడికి’.. రామ్, భీమ్ ‘దోస్తీ’..
తారక్ హోస్ట్ చేస్తున్న విధానం టీవీ ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. ఈ షో ఆగస్టు 22న కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌తో స్టార్ట్ అయ్యింది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పాల్గొని సందడి చేశారు. ఈ ఎపిసోడ్ హైయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ సాధించింది. ఇప్పటివరకు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లతో కంపేర్ చేస్తే కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌కి వచ్చిన టీఆర్‌పీ నే ఎక్కువట.
RRR Team: గెట్ రెడీ.. గుమ్మడికాయ కొట్టేశారు..
రీసెంట్‌గా ప్రీమియర్ అయిన వాటిలోనూ టీఆర్‌పీ పరంగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో నే టాప్ అని తెలుస్తోంది. ఇటీవల తమన్నా హోస్ట్‌గా స్టార్ట్ అయిన మాస్టర్ చెఫ్ ఫస్ట్ ఎపిసోడ్ 4.1 రేటింగ్, ‘జాతిరత్నాలు’ టీవీ ప్రీమియర్ 10.2 రేటింగ్ సాధించగా.. యంగ్ టైగర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కర్టెన్ రైజర్ ఎపిసోడ్ 11.4 టీఆర్‌పీ రేటింగ్ రాబట్టి టాప్‌లో నిలిచింది. ఇప్పుడు ఈ న్యూస్ #NTRsEMKRecordTRP హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.
Evaru Meelo Koteeswarulu : జూ. ఎన్టీఆర్ షో లో రాజమౌళి – రాఘవేంద్ర రావు..!
తారక్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు మరియు ప్రేక్షకులకు అంతకుముందే స్మాల్ స్క్రీన్‌పై కనిపించి, అందర్నీ అలరించడమే కాక మంచి టీఆర్పీ కూడా రాబట్టారు.. రామ్ – భీమ్..
Jr.Ntr : ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కోసం ఎన్టీఆర్ వేసుకున్న బ్లేజర్ రేటు ఎంతంటే…