Viral Photo : ఈ ఫోటోలో ఉన్న ప్రముఖ నటి ఎవరో కనిపెట్టగలరా?

ఇటీవల కాలంలో అనేకమంది ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ప్రముఖ సినీ నటి ఎవరో పోల్చుకోగలరా?

Viral Photo : ఈ ఫోటోలో ఉన్న ప్రముఖ నటి ఎవరో కనిపెట్టగలరా?

Viral Photo

Updated On : December 19, 2023 / 7:32 PM IST

Viral Photo : టీవీ నటిగా కెరియర్ స్టార్ట్ చేసి హీరోయిన్‌గా వెండితెరపై అవకాశాలు చేజిక్కించుకుని బిజీ స్టార్ అయ్యారు మృణాల్ ఠాకూర్. ఈ నటి చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mrunal Thakur

Mrunal Thakur

Salaar : సలార్ ట్రైలర్ రిలీజ్ చేయడం లేదని.. ప్రశాంత్ నీల్ భార్య ఆగ్రహం.. పోస్ట్ వైరల్

తమెంతగానో ఇష్టపడే సినీ సెలబ్రిటీలు చిన్నప్పుడు ఎలా ఉండేవారో తెలుసుకోవాలని.. వీలైతే వారి ఫోటోలు చూడాలని చాలామందికి అనిపిస్తుంది. సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది స్టార్స్ చిన్నప్పటి ఫోటోలు బయటకు వస్తున్నాయి. తమ అభిమాన తారల చిన్ననాటి ఫోటోలు చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు. రీసెంట్‌గా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చైల్డ్‌హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Bigg Boss 7 Telugu Grand Finale: ముగిసిన బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు.. వైరల్ అవుతున్న గ్రాండ్ ఫినాలే ఫొటోస్

మహారాష్ట్రలోని ధూలేలో పుట్టిన మృణాల్ ఠాకూర్ ముంబయిలో చదువుకున్నారు. మాస్ మీడియాలో కోర్స్ పూర్తి చేసిన మృణాల్ ఠాకూర్ 2012 లో ‘ముజ్ సే కుచ్ కెహెతి.. యే కామోషీయన్’ అనే టీవీ సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభించారు. ‘వట్టిదండు’ అనే మరాఠీ సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు. 2018 లో ‘లవ్ సోనియా’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో ‘సీతారామం’ సినిమా తనకి ఎంత పేరు తీసుకువచ్చిందో చెప్పనక్కర్లేదు. ఇక తెలుగు, తమిళ, మళయాళ సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయారు మృణాల్. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకి జోడిగా ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో నటిస్తున్నారు మృణాళ్‌ ఠాకూర్.