విజయ్ సినిమా సెట్‌లో భారీ అగ్నిప్రమాదం

దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా సెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది..

  • Published By: sekhar ,Published On : May 4, 2019 / 12:17 PM IST
విజయ్ సినిమా సెట్‌లో భారీ అగ్నిప్రమాదం

Updated On : May 4, 2019 / 12:17 PM IST

దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా సెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది..

రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా సెట్ కాలిపోయిన ఘటన మరువకముందే, అలాంటి దుర్ఘటన మరొకటి కోలీవుడ్‌లో జరిగింది. దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్‌లో తేరి (పోలీసోడు), మెర్సల్ (అదిరింది) సినిమాల తర్వాత స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో ఓ సినిమా రూపొందుతుంది. హీరోగా విజయ్ 63వ సినిమా ఇది. అభిమానులు ‘దళపతి 63’ అనే వర్కింగ్ టైటిల్ కూడా పెట్టారు. రీసెంట్‌గా ఈ సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

చెన్నైలోని మీనంబాక్కం ప్రాంతంలో, భారీ బడ్జెట్‌తో రోడ్లు, ఇళ్ళు, షాప్స్ వంటివి సెట్ వేస్తున్నారు. వెల్డింగ్ వర్క్ జరుగుతుండగా, కొన్ని నిప్పురవ్వలు ఎగసిపడి, మంటలు వ్యాపించడంతో సెట్ కాలిపోయింది. ఈ రోజు షూటింగ్ లేకపోవడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. మూవీ యూనిట్ ఈ ఘటనపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఈ సినిమాలో విజయ్ సరసన నయన తార హీరోయిన్ గా నటిస్తుండగా, యోగిబాబు, వివేక్, కధీర్, ఇందుజ తదితరులు ఇతర క్యారెక్టర్స్ చేస్తున్నారు.