Ram Charan : అభిమానుల మృతి పై రామ్‌చరణ్..
అభిమానుల మృతి పై రామ్‌చరణ్ స్పందించారు.

Game Changer event attendees killed in Road crash Ram Charan announces ex gratia
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శనివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ ఈవెంట్‌కు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22)లు హాజరు అయ్యారు.
వేడుక అనంతరం వారిద్దరు బైక్ మీద ఇంటికి వెలుతుండగా వడిశలేరులో యాక్సిడెంట్ అయ్యింది. వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఓ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో వారిద్దరు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. అభిమానుల మృతి పై రామ్‌చరణ్ స్పందించారు. ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. భాదితుల కుటుంబ ఇంటికి తన సన్నిహితులను పంపించి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించారు.
Daaku Maharaaj : మామ ఈవెంట్‌కు అల్లుడు గెస్ట్..!
దీనిపై రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ఈవెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటామని, డిప్యూటి సీఎం, బాబాయ్ పవన్ కళ్యాణ్ కోరుకునేది కూడా ఇదేనన్నారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని చెప్పారు. ఇలాంటి సమయంలో అభిమానుల కుటుంబాలు ఎంతగా బాధపడతామో తాను అర్థం చేసుకోగలనని అన్నారు. తనకు చాలా బాధగా ఉందని, అభిమానుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే.. గేమ్ ఛేంజర్ మూవీలో కియారా అద్వానీ కథానాయిక. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Dil Raju : బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం.. దిల్ రాజు